పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36 సాహిత్య మీమాంస

లం దిట్టి సృష్టి అసంగతము. అవి ధర్మమునకు యధాహన్ మగు పదవిని కల్పించనేరవు. ఇరుతెరగుల బలవీర్యము కల్పింపజాలిన మిల్టన్ కూడా ఇట్టి రచన చేయ మొదలుపెట్టి గర్భనిర్భేద మగు అసురసృష్టితో ముగించెను. లాటిన్ గ్రీకు సాహిత్యములందు పార్ధివబలము ఆసుర వీర్యమూ కలిపి చేసిన కల్పన లెన్నో యున్నవి; కాని వాల్మీకి రచనవంటి సుందర చిత్రణ మెందున్నూ కానరాదు. ఇట్టి ధర్మాదర్శములకూ వీరత్వసృష్టికి దివ్యశోభకూ లీలాక్షేత్రములు రామాయణ మహాభారతములే. ఆమహాసముద్రముల యందలి బిందువులగొని కవులు చిన్న చిన్న గ్రంథములకు, పెద్ద పెద్ద కావ్యములను రచించి చదలేటిని భూమిపై ప్రవహింప జేసిరి. ఆప్రవాహమున మున్గినవారు తదమృతరసా స్వాదన మొనర్చి సుఖు లయ్యెదరు. ఆ దివ్యసుధ యింకొక సాహిత్యమున లభింపదు, భారతవర్షమునకది అమూల్యనిధి; తదపూర్వ దివ్యసుందర సృష్టి ననుభవించిన వా రెల్ల తద్గాంభీర్యము పవిత్రతయు గాంచి మ్రాన్పడుదురు.