పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190 సాహిత్య మీమాంస

                 నాకిరీటము నాదు డెందమున నుండు, నాతలన్గాదు, వివిధరత్నముల జెక్క
                 బడగలే, దద్దియున్గావ బడగబోదు, తనివి నామౌళి;దొర లదికనుటయరుదు.
                                                                                        ... ఆ|| నా|| దా||

4. అవ్యభిచారి (ఏకపత్నీ వ్రతస్థుడు)

"యావజ్జీవమూ అవ్యభిచారులై యుండుట స్త్రీపురుషుల ధర్మము; వివాహితులగు దంపతులు వియోగములేక త్రికరణశుద్ధిగా వ్యభిచారులు కాకుండా వర్తింపవలె" నని మన ధర్మశాస్త్రము శాసిస్తూన్నది. ఆదర్శపతి ప్రేమమయుడూ, ఆశుతోషుడూ, సదానందుడూ, పత్నిని గృహలక్ష్మిగా భావించువాడు నౌటచేత వ్యభిచారలిప్తుడై భార్యను బాధించడు. స్త్రీలు దుస్సాంగత్యమువల్ల చెడిపోదురని అతనికి తెలుసును. దుష్టచారిత్రయైన స్త్రీ పుట్టింటికీ అత్తింటికీ కూడా ముప్పుతెచ్చును. అంతేకాదు.

                  "స్త్రీషు దుష్టాసు కాంతేయ జాయతే వర్ణసంకర:,"...భగవద్గీత
                    వర్ణసంకర మయ్యెడు వనిత చెడిన

కావున చెడుసావాసమునుండి చేడియను కాపాడవలెను.

భార్యాభర్తలు కలిసి గృహకృత్యములను నిర్వహిస్తూంటే వా రన్యోన్యశాసితులౌటే కాక అన్యోన్యప్రీతిపాత్రములై ఒకరిమాట నొకరు జవదాటరు. ప్రేమమయుని ఒళ్ళో ప్రేమమయి సంతసమున నుండును, ఆమె తన్ను సేవించుతూ