పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109 పాశవప్రేమ

షేక్స్‌పియ రీవిషయమునే యోగి (Friar) చే రోమియో కిట్లు చెప్పించెను.

                  అంతమక్కువ వలచితి వింతలోనె, రోజలీనును వీడితే? రోతవడితొ?
                  యువకులకు ప్రేమ కన్ను లందుండుఁగాని, హృదయమందున నుండబో దిదినిజంబు*[1]

హెర్మియావివాహము చేయనెంచి ఆమెతండ్రి డెమెట్రియసును వరునిగా నిశ్చయించగా ఆమె లైసాండరును వరించినది, వారిట్లు ప్రసంగింతురు : _

హెర్మి - **[2] అయ్యయో! నాదు జనకుండు నరయడాయె నాదు కన్నుల (యోగ్యుఔనాధుడెవడొ)

తీసి - (అంధవీవేది గన నీకు నక్షియుగము?) నాదు బుద్ధిని గొని నీదు నాధునేర్చు.

వివేచనలేనప్పుడును లోనిపగతురు ప్రబలునప్పుడున్నూ తలిదండ్రుల యెన్నికకు తనయలు సహమతులగుట ఉచితమని షేక్స్‌పియర్ ఒప్పుకొన్నట్లే. అందుననే ఆర్యజాతుల యందు వధూవరుల నిర్ణయించుభారము జననీజనకులో, లేక సువిజ్ఞులైన అభిభావుకులో వహించుట అనాదినుండియు నా

  1. * Is Rosaline, whom thou didst love so dear, So soon forsaken ? Young men's love then lies Not truly in their hearts, but in their eyes. (Romeo and Jiuliet Act III)
  2. ** Herm - I would my father look'd but with my eyes. Thseus - Rather your eyes must with his Judgment look. (Mid-Nig-Dream)