పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

85 దివ్యప్రేమ

పార్వతియు పూతచరితయే. అప్సరస్సంభవయైన శకుంతలయు తుద కిట్టి పవిత్రమూర్తిగానే పరిణమించింది. ఇట్టి నారీమణుల సంసర్గమున మానవప్రకృతి పవిత్రితమైన దన వచ్చును.

ఆర్యసతి యాత్మోత్సర్గము

పత్యనురాగము ప్రబలినకొద్దీ సతి తన అస్తిత్వమే మరచిపోవును. ప్రేమావేశమున ఆత్మవిస్మృతినొంది సర్వవిషయముల తన పతితో సాయుజ్య మొందును. ఆతని సుఖమే తన సుఖమనియు, ఆతని దు:ఖమే తన దు:ఖమనియు, భావించడమే దాంపత్యప్రేమకు పరమావధి అని ఇందువల్ల విదితమగును. ఆర్యకుటుంబములందు పతికీ సతికిన్నీ స్వార్థ మొకటి, సుఖమొక్కటి, స్వర్గమొక్కటి; ఇట్టి ఐక్యత అలవడనిచో దాంపత్యమే సిద్ధింపదు.

పాశ్చాత్యదంపతుల స్వార్థములు వేరు, రుచులు వేరు, పారలౌకికేష్టసాధనలు వేరు; తత్పరిస్థితులు పతిపత్నీ విచ్ఛేదకారకములౌట వారియందు భారతీయ దాంపత్య మందలి ఏకాగ్రత, ఏకనిష్ఠ, ఆత్మోత్సర్గమూ సిద్ధించు నవకాశ మంతగా లేదు. భారతరమణు లేకాగ్రమనస్కలై పతుల ననుగమించుచు సహధర్మిణీసౌభాగ్య మనుభవింతురు; పాశ్చాత్యనారీమణుల కిట్టి సౌకర్యము లభింపదు, ఇష్టవస్తు విభేదము వారిని పతులనుండి వేరుచేయును.

ఆర్యసతీమణులయందలి ప్రగాఢప్రేమ వారియం