పుట:SaakshiPartIII.djvu/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైనో బరువెల్ల మోపి మిగిలిన కాలికిఁ బనియేమియు నీయరు. కుడికాలిపై నిలువ నలవాటుగగల తల్లిదండ్రులకుఁ బుట్టినపిల్ల ప్రధానముగఁ గుడికాలిపైనే నిలువంబడును. మన మప్పడప్పడు కుడి చేతివ్రేళ్లసందులలో నెడమచేతివ్రేళ్లిముడ్చుకొని కొంతసేపట్టే యుంచుకొనుట తటస్టించుచ్నునది. అట్టి హస్తపుటమునకు మొట్టమొదటి వ్రేలు కుడిబొట నవ్రేలైనఁ గానవచ్చును. ఎడమ బొట్టనవ్రేలైన గానవచ్చును. దక్షిణాంగుష్టమే మొదటిది యగునట్టుగా హస్తములు ముడుచుకొను నలవాటు తల్లికో తండ్రికో యున్నయెడలం బిల్లకూడ నటులే హస్తయుగ్మమును ముడుచుకొనును. నడుచునపుడు ముందువేయు కాలుకూడ ననూచానస్థితి ననుసరించి యుండుననుట యతిశయోక్తి కాదు.

అయ్యా! Herediry కల్లయని నిర్ధారణ మొనర్చుటకు మీరు కొన్ని యుదాహరణ ములు నిచ్చినారు. అవి సమంజసముగ లేవు. పండితాగ్రగణ్యునకు శుంఠ జన్మించుచున్నాఁ డని చెప్పినారు. తండ్రి షట్చాస్త్ర పాండిత్యమునే మీరు పరిశీలించినారు. కాని మేనమామ శుంఠత్వ సామ్రాజ్యమును మీరు పరీక్షింపలేదు. ఈ తప్ప మీదికాని Heredityది కాదు. మహావదాన్యుఁడైనవానికి లుబ్దాధమాధముండైన నిర్భాగ్యు డుదయించుచున్నాఁడని మీరు చెప్పినారు. ఈలుద్దాధమాధముని పితామహుడు శ్రాద్దములు చేసి, శవములు మోసి, శల్యపరమాన్నమును దిని, చౌర్యము లొనర్చి స్వామిద్రోహకృత్యము లొనర్చి తాను తినక యొకనికిఁ బెట్టక కూడఁబెట్టిన ధనమంతయుఁ దనకొడుకు తాను జచ్చిన పిమ్మట దానధర్మములకై తగులఁబెట్టుచున్నాఁ డని కడుపుమంటచే గాలిపోవుచుఁ దనధనము నెటులైనఁ గాపాడు కొనవలయునను దయ్యపుఁ బట్టుదల కలిగి, ద్విగుణీకృత లుబ్ధత్వముతోఁ దానే తనకు మనుమడై పుట్టెనని మీరు గ్రహింపలేకపోవుటచేత మీకు వ్యత్యా సముగాఁ గనంబడుచున్నది. కాంతాలంపటుడై, కాతరుఁడైన దశరథునకు శ్రీరామచంద్రు నివంటి యేకపత్నీవ్రతుఁడు, జగదేకవీరుడు జన్మించినప్ప డింక Heredity ని నమ్మవలసిన పనియేమున్నదని మీరు పలికినారు. అట్టనుట తప్ప. అందుచేతనే మఱింత నమ్మవలసియు న్నది. దశరథుని కాంతా లోలత్వమే మీరు గణించితిరి కాని హోమాగ్నిజ్వాలాతుల్యయగు కౌసల్యాదేవిపరిశుద్దిని మీరు గణించితిరి కారే! దశరథుని భయస్వభామునే మీరు గణించితిరి కాని రఘుదిలీపాదిమహారాజుల పౌరుషసంఘాత మంతయు శ్రీరామచంద్రపరబ్రహ్మము లోని కాకర్షింపఁబడినదని మీరు గ్రహింపలేకపోయితిరే! మీరిచ్చిన యుదాహరణము లన్నియు నిట్లే యసంబద్దములై యవిచారపూర్వకములై యున్నవనుట నిశ్చయము.

ఇంక వంశానుక్రమముగ వచ్చు రోగములను గూర్చి రవంత చెప్పవలసియున్నది. ఉబ్బసము, మూలవ్యాధి, క్షయము, కుష్టము నీతరగతి లోని ప్రధానవ్యాధులు Intermittence of the Heart (నాడి నాలుగైదు దెబ్బలు కొట్టినతరువాత నొక దెబ్బకాలము నిలిచిపోవుట) అనునదికూడ మూఁడు తరములనుండి యొక కుటుంబములో నున్నట్లు కనిపెట్టం బడినది. Hysteria యనునది కూడ నట్టి వ్యాధియే యని కొందఱు చెపుచున్నారు. అంధత్వముకూడ నీ తరగతిలోనిదే యని కొందఱ యభిప్రాయము. తాతగారి యంధత్వము మనుమనికి వచ్చుట కలదు. అది జనుషాంధత్వమైన సరే. చెప్పరాని వ్యాధులలో నొవకదానివిసము వంశములో నాల్గుతరములవఱకు నిలిచియుండునని కొందఱు చెప్పచు న్నారు. పిల్లనిచ్చుటకుఁ గాని తెచ్చుకొనుటకుఁ గాని మనవారు కుటుంబ సంప్రదాయమును