ఈ పుట ఆమోదించబడ్డది
9 4
ఎన్నొ సారులు చింతచేసితిఁ
గ్రన్నమధువును గ్రోలనంచును
తిన్నగా నీమనసునిలువది
కేమి చేయగలన్
చెన్ను మీఱ వసంతకాలము
వన్నె హొయలు గులాబి పువ్వులఁ
గన్నుపండు వొనర్చెఁ బశ్చా
త్తాప మెట్టిదిఁకన్
95
మదిర మను నీహొంతకారిని
మదిని నిల్పఁగఁ బరువు పోయెను
అదియు నుండిన లేక యుండిన
నేమి నాకింకన్
పదిలముగ నా తనువులోపల
కుదురుకొని ప్రాణంబు లుండఁగ
నదను తప్పిన నెట్లువచ్చునొ
దీని నెటు విడుతున్.
48