ఈ పుట ఆమోదించబడ్డది
40
గంటపువ్వును చూచినావా
కట కన్నునుపెట్టి మంచుకు
నంటియుండుుట, యట్లెనీ వు
త్సాహ మొందవయూ.
వెంటనంటిన మృత్యు దేవత
మంటిలో నిను నుత్తపాత్ర
వంటివాఁడని బోరిలించిన
యంతవఱకైనన్
41
ఆశకెక్కడి కంతమున్నదె
పాశములు దుఃఖములు సుఖములు
ఆశలను పోఁద్రోలి యానం
దంబు నొందవయా.
నాశనంబగు నెల్లయది, యా
వేశమొప్పఁగ మధురసంబును
పాశరహితుఁడ వగుచుఁ గ్రోలుము
ప్రియను గూడుచును.
20