ఈ పుట ఆమోదించబడ్డది
8
ఏదొ యొక్కటి, 'బాల్ఖొ,' మఱి 'బా
గ్దాదొ' యేదో, గ్లాసులోపల
చేదో, తీపియె, యుండు నిఁకపై
దానిపని యేమి?
పాదుకొన్న జీవమను నీ
స్వాదుద్రాక్షంసంబు చిందఁగ
మీఁదఁ బ్రాణముల నెడు పత్రము
లెల్ల రాలఁగను.
9
తెల్ల వారఁగ వేయ్ గులాబీ
ల్మొల్లముగఁ జేకూరునందువు;
కల్ల; నిన్నటి మేల్గులాబీ
యెచటి కేఁగెనయా.?
పల్లవించెడు కాలమది కడు
చల్లనే యౌఁగాని యప్పటి
కేల్ల రాజులు రెడ్డులును మఱి
చల్లఁబడుదురుగా.
5