74
రంగూన్‌రౌడీ.
సన్యసించిన నాకు శస్తభూషణలేల ?
రుదురాకపేరులే కుదురుఁగాని
తపసినౌ నాకు మదనమంత్రజపమేల?
నారాయణస్మరణంబెకాని
గీ. కరమునందాల్ప నాకు శృంగార మేల?
పూజితంబైన జపమాల పోలుఁగాని
ఇన్నిటి నెఱింగి యీశ్వరుం డిట్లు సేయ
వగవ నేల? నానందింపఁ దగును గాని.
బట్ల - (ఒకచీరతో ప్రవేశము.)
ప్రభా - నాయనా ! నీయజమాని నవిన్నపమును మన్నించెనా ?
బట్ల - మన్నించెను. నీవు ధరియింప నీచేలమునుఁగూడ పంపెను. దీనిని మేనఁదాల్చి దానిని నాకిమ్ము. (ఇచ్చును.)
ప్రభా - (కైకొని కన్నుల కద్దుకొని) నాయనా ! ఇప్పటియవస్థ కీచేలమే నాకు మిక్కిలి యర్హమైనది. భగవంతుఁడే దీనిని నీమూలమున నాకు దయచేసినాఁడు. నీకు చిరాయుష్యము గల్గుఁ గాక
(చీరను గొని చాటున కేగును.)
( తెరవ్రాలును.)
రంగము. 2.
స్థలము:- గంగారాంసేట్ గృహము.
[గంగారాముఁడు రక్ష రేకులుగట్టుకొని కుర్చీమీద పండుకొని ]
గంగా - దర్వాన్ !
జయ - హాజర్ మహరాజ్ !
గంగా - ఈదయ్యాలభయముచేత నాకు నిద్దురలోగూడ దయ్యాలే కనఁబడుచున్నాయి. కొంచెం మనస్సు శాంతంగా ఉండడం కోసం రామాయణం చదువుతావా?