22
రంగూన్రౌడీ.
నాంది - మఱినీవు దాసివికావూ?
దాసి - నో! నో! అయామ్ దీ సర్వెంట్ ఆఫ్ సేట్ సాహేబ్ . అనఁగా నేను సేటుసాహేబుగారి సర్వెంటును.
నాంది - అబ్బో ! సీమకుక్కవలె తయారైనావు. చిల్లరపనులుచేయవు కాఁబోలును! మఱినీవు చేసేపను లేమిటీ ?
దాసి - హమేషా సేట్ సాహేబుగారిదగ్గర హాజరుగా ఉండడం. ఆయనకు డ్రెస్ కావాలిస్తే అందివ్వడం. పండుకొన్నప్పుడు పంకా విసరడం - ప్రక్క. వేయడం.
నాంది – (ఈర్ష్యతో) ప్రక్క వేసి పండుకోవడం.
దాసి - చెడుమాటలాడకు; చెంపదెబ్బలు తింటావు.
నాంది - ముండా ! నాయింట్లో ఇందుకే చేరావంటే !
దాసి - రండా ! నన్ను తిడతావంటే - (అనుబంధము-9.)
[ఇద్దఱును కొట్టుకొనుచుండగా గంగారాంసేటు ప్రవేశించును. ఇద్దఱును కలిసి అతనినిగూడ కొట్టుదురు.]
గుగా - శాంతించండి ! శాంతించండి ! గంగాగౌరీసంవాదము.
నాంది - ఈ రాక్షసినిఁ దెచ్చి నానెత్తిమీఁది కెక్కించి, తిట్టించవలెననుకొన్నావా ?
దాసి - ఈగయ్యాళిదగ్గర తిట్లుపడమని నన్ను తెచ్చావా ?
గంగా - మీరు తిట్టుకోవద్దు- కొట్టుకోవద్దు- మాట్లడుకోనే వద్దు -సర్వెంట్! నీవు లోపలికి వెళ్ళు.
(దాసి, నాందీబాయి మెటికలువిఱుచుకొందురు. దాసినిష్క్రమించును.)
(తెరలో) సేట్ సా హేబ్ ! ఒకదర్వాన్ మీదర్శనానికి వచ్చాడు.
గంగా - అచ్ఛా ! అచ్ఛా ! రమ్మను.
జయ — [1](దర్వాన్ వేషముతో ప్రవేశము.)
- ↑ దర్వాన్ -హిందూస్థానీ ద్వారరక్షకుఁడు.