ప్రధమాంకము.
3
అన్న -- (భర్తవంకకుఁ దిరిగి) నాధా ! నిరంతరము మీ పాదపద్మపరిచర్య కర్హు రాలనైన మీదాసి నగు నన్ను “అన్నపూర్ణాదేవిగా” రను పెద్దపేరునఁ బిలువ నేల ?
శంక - ఏలనా ? ఈదినముఁగూడ మేము త్రాగి వచ్చినందులకై మీరు దండింపకుండఁ జేసికొనుటకు.
అన్న - హరి హరీ ! ఎందులకు నిందించెదరు? నే నెన్నఁడైన మిమ్ము పల్లెత్తుమాటాడి యెఱుఁగుదునా ? మీరు ప్రభువులు, నేను దాసిని. మిమ్ము దండించుటకు నా కధికారము గలదా ?
శంక - అధికారము లేదని అణఁగియుంటివిగాని, తాఖతుగలిగినచో దండింతువు కాఁబోలు నేమి ?
అన్న - నాధా! వచ్చినదే తడవుగ నన్నిట్లు వాయఁ దిట్టుటకు నే నేమి యపరాధము చేసితిని ?
సీ. పతికన్న వేరుగా పరదైవతము నాకు
గలుగఁబోవఁ డటంచుఁ దలఁచుకొంటి,
నాథునిపదపూజనంబె నా కిహపరో
త్తరణమౌ గతిగాఁగ నరసికొంటి,
ఈ యనాధకు హృదయేశ్వరముఖదర్శ
నమె ప్రమోదం బని నమ్ముకొంటి,
ఎట్టికష్టము లావహిల్లిన మీయండ
వీడని ధైర్యంబుతోడ నుంటి,
నిష్కళంకమైన నిర్మలభ క్తితో
సతము మిమ్ము పూజ సల్పుచుంటి,
నట్టి పాదదాసి నగు నన్ను నిష్ఠుర
భాషలాడ నాదుపాప మేమి?
శంక --హహ్హహ్హహ్హహ్హ ! వెఱ్ఱిదానా ! అన్నపూర్ణా ! ఈమాత్రమునకే దుఃఖించుచుంటివా ? ఊరక పరిహాసమునకై నిన్నిట్లంటిని గాని,