పుట:Raajasthaana-Kathaavali.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

రాజస్థానకధావళి,


యిల్లు దూరినప్పుడు సురేశమల్లుని తనయులలో నొకండు చిత్తూరు నిమిత్తము తన ప్రాణములు ధారవూసె.

ఇట్లు పినతండ్రిని స్వదేశమునుండి పారదోలి యనంతరము పృథివిరాజు తనయన్న యగు సంగుఁడప్పటికిని జీవించియున్న వాఁడనియు వానికి వివాహ ప్రయత్నములు జరుగుచున్న వనియు విని తొల్లి చారుణీదేవీ యర్చకురాలు చెప్పినమాట తలంచి సంగుఁడు జీవించి యుండిన చోఁ దనకు రాజయోగముఁ బట్టదని వానిని వెదకి వెదకి జంపుటకు బయనమైపోవ నిశ్చయించుకొనియె. అంతలో వానిసోదరి వచ్చి దీనమగు తనవృత్తాంతముఁ జెప్పి సోదరుని పయన మాపెను.

రాయమల్లుఁడు తనకూఁతును సిరోహి దేశపు రాజున కిచ్చి వివాహము చేసెను. ఆకన్యక చక్కదనంబునకును సౌజన్యతకును బాతివ్రత్యమునకును బేరువడసిన యోగ్యురా లైనను మగఁ డామెను నిరంతరమును దగినయాదరణము సేయక నీచముగా జూచుచుండెను. ఆ రాజు నల్లమందు మద్దత్తు మితిమీరునట్లు ద్రావి యొడ లేఱుంగక భార్యను కొప్పుపట్టి పాన్పుమీఁదనుండి లాగి రాత్రి యంతయు గటికి నేలం బండుకొన జేయు చుండెను. ఆభిజాత్యముగల రాజకన్యక కంత కంటే నెక్కుడవమానము లేదు. కావుక యా బాలిక తన దైన్యమును బాపు మని సోదరునకు విజ్ఞాపనము నంపుకొనియె, పృథివిరాజు సోదరీ వత్సలుండై సంగునిమీఁదికి బోవలసిన పయనము మాని సిరోహి పట్టణమునకు బయనమైపోయి యానగరముఁ జేరి యథ౯ రాత్రమున నెవ్వ రెఱుంగకుండ కోటగోడలం దాఁటి యంతఃపురము బ్రవేశించి పండుకొన్న గదిలో నిలిచె. అప్పుడు సిరోహి రాజు నల్లమందుమత్తుచే మేను మఱచి మంచము పైఁ బవ్వళించి యుండె. వాని భార్యయు భత౯ చేత నవమానింపఁబడి వట్టినేలం బండుకొని యుండె.

పృథివిరాజు తన గారాపుఁ జెలియలి దురవస్థ గన్ను లారఁ గనుంగొని కోపావేశంబున పరవశత్వంబు జెంది పరాభవానలముం