పుట:Raajasthaana-Kathaavali.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

రాజస్థానకధావళీ,


ఈస్వల్ప సైన్యముతోడనే రాణ యుమ్రా కొంతకాలము చక్రవర్తి సేనల నెదిరించి శౌర్యము చూపెను. కాని యెట్టకేలకు దురకలబారికి నిలువ లేక రాణా లోఁబడవలసి వచ్చె. ఈ రాణా యెట్లు లోఁబడెనో యావృత్తాంతము జహంగీరు స్వహస్తముతో వ్రాసిన చర్య (Diary.) నుబట్టి తెలిసికొన వచ్చును. అందిట్లున్నది. "నేను సింహాసన మెక్కిన 9వ సంవత్సర ప్రారంభమున (అనఁగా 1614 సంవత్సరమున) నాకుమారుఁడు "జగద్గర్వ" మనుబిరుదుగల రాణా పట్టపు టేనుఁగును భద్రజాతి గజముల మణి పదునేడింటిని బట్టుకొని యొక మంచిదినమున నాకుం గానుకగా బంపె. నేను మహానందభరితుఁడనై మఱునాఁడు జగద్గర్వము పై నెక్కి యూరేగి లెక్కలేనిసొమ్ము పంచి పెట్టితిని."

చక్రవతి౯ సైన్యములు తన దేశమును నిరంతరము నాశనము చేయుటయుఁ దనకు కుడిభుజములట్లు పనిసేయు రాజపుత్ర వీరులు రణభూమిం ద్రెళ్ళుటయు నమ్మహవీరుల దారపుత్రాదులు తురకలచేఁజిక్కి బంధింపఁ బడుటయు, విశేషించి తన ప్రాణపద మగుపట్టపు టేనుఁగు పరులపా లగుటయు చూచి విహ్వలుఁడై రాణా యుమ్రా తొల్లింటి గర్వమెల్ల డీలుపడి వినయముతోఁ జక్రవర్తి కుమారున కిట్లు రాయబార మంపెను. "మీరు సన్ను క్షమియించి చక్రవర్తి యనుగ్రహమునకుఁ బాత్రుఁడుగం జేయుదు నేని నేను మీకు లోఁబడు దును. తక్కిన రాజకుమారులట్లే నాకుమారుఁడును జక్రవతి౯ సేవం జేయఁగలవాడు."

రాణా పంపినయీసందేశము విని జహాంగీరు మేరమీరిన సంతోషము నొంది తన దినచర్యలో నీక్రింది విధమున వ్రాసికొనెను «ఈ గొప్ప కార్యము నాపరిపాలనములోనే జరిగినందుకు నేను పొందిన యానంద మింతింత కాదు. అతి ప్రాచీను లగునారాజపుత్రులను వారి రాజ్యమునుండి తరిమి వేయవలదని నాకుమారున కాజ్ఞాపించితిని.