పుట:Punitha Matha.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనవిమూట ప్రస్తుత రచయిత 1966లో జ్ఞానపురం క్రైస్తవులకు మరియమాత మీద ఓ ధ్యానం ఇచ్చాడు. ఆ ధ్యానంలో చెప్పిన అంశాలనే ఇక్కడ గ్రంథరూపంలో వెలువరించడం జరిగింది.

ఈ గ్రంథం శ్రీసభలో మరియమాతకుండే స్థానమేమిటో నిర్ధారిస్తుంది.ఆ పునీతమాట పట్ల భక్తి ఎందుకు చూపాలో, ఎలా చూపాలో చెప్తుంది. ఈ పుస్తకాన్ని మరియను గూర్చిన కట్టుకథలతో నింపదలచుకోలేదు. అలాంటి వాటిపట్ల ఈ రచయితకు ఆదరంలేదు. ఇది ప్రధానంగా మరియను గూర్చిన దైవశాస్తాంశాలను వివరించే గ్రంథం. ఈ శాస్తాంశాలు గూడ అత్యధికంగా పితపాదుల పారంపర్య బోధనుండి స్వీకరింపబడ్డాయి. బైబులు వస్తుతః మరియనుగూర్చి చెప్పే అంశాలు చాల స్వల్పం.

మామూలుగా మరియు మాత పేరెత్తగానే ప్రోటస్టెంటు సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. కాని ఈ భేదభావాలు అడుగంటిపోవాలనే రచయిత కోరిక. అంచేత ఈ పుస్తకంలో మరియను గూర్చిన క్యాథలిక్ భావాలూ, ప్రోటస్టెంటు భావాలూ నిష్పాక్షికంగా చర్శింపబడ్డాయి. పితృపాదుల పారంపర్య బోధను గుర్తించందే మరియు స్థానమూ, ఆ పునీతమాత పట్ల చూపే భక్తి అర్ధం కావని నిరూపింపబడింది. ఈ గ్రంథం క్రైస్తవశాఖల విభజనకు