పుట:Punitha Matha.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
4. కన్నెరికపు విలువలు

మరియ కన్యగా వుండిపోయి చాల విలువలు నెలకొల్పింది. క్రీస్తుకు పరలోకంలో తల్లిలేదు. భూలోకంలో తండ్రి లేడు. అనగా అక్కడ యిక్కడాను మానుష ప్రయత్నం లేకుండానే జన్మించిన ఏకైక కుమారుడు యేసు. ఈలాంటి కుమారునికి తల్లియై జన్మ సార్ధకం జేసుకుంది మరియ. బలిపీఠం మీద పాత్రం పవిత్రమైంది. దాన్ని వేరే పానీయాలకు వాడం. క్రీస్తు జననం ద్వారా మరియమాత గర్భం కూడ పవిత్రమైంది. ఆ గర్భం దేవునికే అంకిత మైంది. ఆ గర్భం నుండి వేరే బిడ్డలు కలగరు. కలుగకూడదు. ఆమె కన్నెరికం అంత విలువైంది.

కన్యత్వంద్వారానే మరియు దేవునికి యోగ్యురాలైన తల్లి కాగల్గింది. కన్యత్వం ద్వారానే ఆమె మనకూ తల్లి ఔతుంది. మన రక్షణ కోసం ప్రభుని ప్రార్ధిస్తుంది. మనకు వరప్రసాదాలు ఆర్జించి పెడుతుంది. మనలను పవిత్రులను చేస్తుంది.

ప్రాచీన క్రైస్తవ రచయితలు ఆమె కన్నెరికాన్ని వేనోళ్ల కొనియాడారు. సీనాయి వద్ద మోషే చూచినపొద కాలుతూకూడ నుసికాలేదు. సంసార జీవితం జీవించి బిడ్డను కన్నా మరియ తన కన్యత్వాన్నికోల్పోలేదు. ఆమె తన్ను సృష్టించిన దేవుణ్ణి, భూమ్యాకాశాలు భరించలేని ప్రభువుని, తన ఉదరంలో భరించిన భాగ్యమూర్తి. దానియేలు గ్రంథం వర్ణించే అగ్ని గుండంలోని అగ్ని బాలురను తాకలేదు. అలాగే మరియమాత గర్భంలో ప్రవేశించిన దైవతేజస్సు కూడ ఆమె కన్యత్వాన్ని నాశం నాసం చేయలేదు.. యెహెజేలు గ్రంథం వర్ణించే తూర్పు ద్వారం, ఓమారు ప్రభువు ప్రవేవించాక శాశ్వతంగా L