పుట:Pranayamamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని, బలమును సంపాదించు కొనుచున్నదని మానసికముగ భావించుము.

మానసిక విశ్రాంతి

మనశ్శాంతి, సమానత్వములు - కోపము, చీకాకు లను నవిలేకున్నచో లభించును. కోపము చీకాకులకు వెనుక భయము దాగి యుండును. కోపము, చింతలవలన వచ్చునదేమియూ లేకపోగా మిక్కుటమగు శక్తి వ్యర్థమగును. ఈ రెండు దుర్లక్షణములు గలవాడు దుర్బలుడే. కావున జాగ్రత్తగలిగి యుండుము. అన్ని విధములగు అనవసరపు చీకాకు చింతలను పారద్రోలుము.

15 నిమిషముల సేపటివరకు శరీరమును సడలించి, సుఖముగావుండు ఆసనములో వుండుము. కనులు మూయుము. మనస్సును బాహ్యవిషయములనుండి మరల్చుము. మనస్సును నిలుకడ గలదిగా చేయుము.

సంకల్పముల నన్నిటిని శాంతింప జేయుము. కొబ్బరి పెంకు, లోపలనున్నకురిడీ రెండును ఏ విధమగ విడివిడిగా నున్నవో, అదేరీతిని నీశరీరము, నీవు భిన్నభిన్నముగా వున్నారని తలచుము. ఈ శరీరము నీ చేతియందలి ఒక పరికరమని తలంచుము. నీవు సర్వవ్యాపియగు ఆత్మనని తలంచుము. సముద్రమునందు తేలియున్న గడ్డిపోచవలె, అనంతమగు ఈ ఆత్మయందు నీ శరీరమున్నూ, సమస్త ప్రపంచమున్నూ తేలియున్నవని తలంచుము. పరమాత్మతో సంబంధము కలిగి యున్నటుల అనుభవించుము. ఈ సమస్త ప్రపంచము నీవల్లనే