పుట:Pranayamamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుము. అభ్యాసము చేయునప్పుడు మానసికముగ 'ఓం'ను జపించుము. వీలై, యిష్టమైనచో "సుఖపూర్వక ప్రాణాయామము"ను కూడ చేయవచ్చును. ఇది, ఆసనము, ప్రాణాయామము, ధ్యానము విశ్రాంతులు కలసియున్న సాధన, ఇందువల్ల శరీరమునకు మనస్సుకు విశ్రాంతి లభించును. పెద్ద వయస్సు వచ్చినవారికి యిది చాల అనుకూలమైనది.

క్రమ శ్వాస

సాధారణముగ స్త్రీలుగాని, పురుషులుగాని పీల్చెడి శ్వాస సరిగలేదు. గాలి విడచునప్పుడు 16 అం నిడివిగను, పీల్చునప్పుడు 12 అం. నిడివిగను వుంటున్నది. ఇందువల్ల 4 అం. శ్వాస వ్యర్థముగ పోవుచున్నది. పీల్చునప్పుడుకూడ 16 అం. నిడివిగ పీల్చుచో క్రమశ్వాసయగును. ఇటులచేయుటచే కుండలినీశక్తి మేల్కొనును. ఇట్టి క్రమశ్వాసవల్ల నిజమగు విశ్రాంతి లభించును. సుషుమ్నా శీర్షకములో గల శ్వాసకేంద్రము వశపడును. ప్రశాంతముగా మనస్సుండును.

ఉచ్ఛ్వాసనిశ్వాసల పరిమాణము సమానముగ వుండుటనే క్రమశ్వాసయందురు. 6 'ఓం' లను జపించునంత సేపటి వరకు పూరకము చేయుము. రేచకమునుకూడా 6 'ఓం' లను జపించుటకు పట్టునంతటిసేపువరకే చేయును. ఇది శరీరమును ప్రశాంతస్థితిలో వుండులాగున చేయుము. ఇందువల్ల మనస్సు, ఇంద్రియములు శాంతినిపొందుటయే గాక అలసియున్న నరములకు తిరిగి బలము కలుగును. అన్ని విధములగు తొందరలు, తొట్రుపాటులు, ఆవేశములు అణగిపోయి సముద్రము వలె గంభీరముగ వుందువు.