పుట:Pranayamamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరకు కుంభకము చేయుము. 32 మారులు జపించుట అగునంతవరకు గాలిని విడుచు చుండుము. '(ఎడమ ముక్కుతో)'

3. ముక్కు పుటమువద్ద దృష్టిని నిలుపుము. ఎడమ ముక్కుతో 16 మారులు 'తం' అను బీజాక్షరమును జపించు నంత వరకు గాలిని పీల్చుము.

64 మారులు జపించునంతవరకు గాలిని లోపలఆపుము. ఈ కుంభక సమయములో చంద్రనాడిగుండా అమృతము శరీర మందలి అన్ని నాడులలోనికి ప్రవహించి, శరీరమునంతటిని పరి శుద్ధ పరచుచున్నదని భావించుము. ఆ తరువాత 32 మారులు 'అం' బీజాక్షరము (పృథ్వీబీజము) జపించునంతవరకు కుడిముక్కుతో గాలిని విడువుము.

పై మూడు రకములగు ప్రాణాయామములు నాడీశుద్ధిని బాగుగా కలిగించును.

ప్రాణాయామ సమయమున మంత్రజపము

ప్రాణాయామ సమయమున మంత్రజపము చేయుటను గురించి ఈశ్వర గీతలో యీ విధముగా చెప్పబడివున్నది:- సప్తవ్యాహృతులతో గూడిన గాయత్రీ మంత్రమును ఆద్యంతముల యందు ఓం కార సహితముగ, ప్రాణమును నియమించి జపించినచో అదియొక ప్రాణాయామమగును.

ఓం భూ: ఒం భువ:, ఓగ్‌ం సున:, ఓం మహ:, ఓం జన:, ఓం తప: ఓగ్‌ం సత్యం. ఇవి సప్తవ్యాహృతులనబడును.