పుట:Pranayamamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అరకాలి వరకు వుండును. దీనిని చీమలాటి జీవిని తాకుటచే కలుగు స్పర్శ జ్ఞానమువల్ల తెలసి కొన వచ్చును. శ్వాస ప్రశ్వాసల బాహ్యాభ్యంతర దూరములను అనుసరించి, కుంభకము యొక్క దూరము [స్థలము] వుండును. ఏలనన, ఈ శ్వాసపై రెండుస్థలములందును ఆగ గలిగియున్నది. ఇది దానిధర్మము. పైన సూచించిన రెండునూ లేకుండ పోయి నప్పుడు దీనిని గురించి తెలసి కొన గలము.

కాలము, స్థలము, సంఖ్య - అను మూడు రకములగు ప్రాణాయామ విధానములు ఐచ్చికములు మాత్రమే, అనేక స్మృతులు ఈ మూటికిని ప్రాధాన్యతను యివ్వక, కాలమునకు మాత్రమే ప్రాధాన్యమును ఇచ్చినవి. అందు వలన వీటిని గురించి ఎక్కువ బాధపడనక్కర లేదు.

నాల్గవది శ్వాసను బంధించుట, (బయటగాని, లోపల గాని):-

"బాహ్యాభ్యంతర - నిశ్యక్షేపి - చతుర్థ:

యోగసూత్ర - 2 అ.

యొగసూత్రములలో 50 వ సూత్రములో చెప్పబడిన మూడవ మాదిరి ప్రాణాయామము, మొదటి ఉద్ఘటావస్థ ప్రాప్తించు నంతవరకే చేతురు. ఆ తరువాత ఈ నాల్గవ మాదిరి ప్రాణాయామమును చేయవలెను. ఈ స్థితిలో సాధకుడు తన ప్రాణము శరీరమున గల అనేక చక్రములపై ధారణ చేయునటుల క్రమ క్రమముగ అభ్యసించి, చివరకు తలలో గల సహస్రారముపై ధారణ చేయునటుల చేయును. అతనికి పూర్ణ సమాధి సాహస్రారములో సిద్థించును. ఇది ఆంతరిక విధానము. ఇక బాహ్యవిధానము; ఏ తత్త్వమున ప్రాణ వాయువు ఎంతదూరమువరకు పోవునో అంతదూరమున ధారణ