పుట:Pranayamamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుషుమ్న వైపు పోవునటుల చేయును. మెడయందలిస్నాయువులు, అపానవాయువు ఈరెండు ఒత్తిపట్టి యుంచుటచే ప్రాణవాయువు తప్పని సరిగ సుషుమ్నలో ప్రవేశించుటకు ప్రయత్నించును. ఈ సుషుమ్న ఇడ పింగళలకు మధ్యగనుండును. కొంతసేపు ఇడ, కొంతసేపు పింగళ నాడులలో సంచరించు ఈ ప్రాణ వాయువును కుంభకమువల్ల ఆపుజేయవలెను. ఇటుల చేయుటచే తప్పని సరిగ ప్రాణవాయువును సుషుమ్నా నాడిలో సంచరించులాగునచేసి, యోగి ప్రపంచముతో సంబంధము లేనివాడుగ అగును. దీనినే సమాధి అందురు. ప్రాణవాయువును క్రింద అదిమిపట్టి, అపానవాయువును పీల్చుటవలన యోగి ముసలితనమును పొందక, పదునారేండ్ల యువకునివలె అగును. ప్రపంచమునందలి ఏ వైద్యశాస్త్రము కుదుర్చని మొండివ్యాధులన్నియు, ప్రాణాయామమువలన మొదలంట నాశనమగును.

నాడీశుద్ధి కలిగినటుల తెలిసికొనుటకు, కొన్ని బాహ్య చిహ్నములు గలవు. శరీరము తేలికయగుట, శరీరకాంతి, జఠరాగ్ని వృద్ధియగుట, శరీరము సన్నబడుట, శరీరము అవిరామముగ బాధ నొందకుండుట, ఇవన్నియు నాడీశుద్ధి కలిగినదని తెలిసికొనుటకు గుర్తులు.

షట్కర్మలు

లావుగా శ్లేష్మ తత్వమును కలిగియున్నవారు, మొట్టమొదట షట్క్రియలను అభ్యసించి, ఆపిదప ప్రాణాయామమును అభ్యసించినచో, సులభముగ విజయము లభించగలదు. 1. ధౌతి