పుట:Pranayamamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలి విడచుట, గాలి పీల్చుట, గాలిని ఆపు జేయుట, దీనినే సంస్కృతములో 'ప్రణవము' అని కూడ అందురు. పద్మాసనములో కూర్చొని, నాసాగ్రముపై దృష్టిని నిలపి, ఎఱ్ఱటి రంగుతో, అనంతమైన కిరణములతో కూడియుండి, హంసపై ఎక్కి, చేతిలో ఒక కఱ్ఱను గలిగియుండి, చంద్రుని వలె ప్రతిబింబము గలిగి యుండు బాలికయగు గాయత్రీ దేవిని, సాధకుడు ధ్యానించ వలెను. 'అ'కారము ఆమెయొక్క సంజ్ఞ. 'ఉ' కారము సావిత్రికి; ఈమె తెల్లటి ఆకృతి గలిగి చేతిలో ఒక గుండ్రని చక్రమువంటి బిళ్ళను గలిగియుండి, గరుత్మంతునిపై ఎక్కియుండు యువతి. 'మ" కారము సరస్వతికి సంజ్ఞ. ఈమె నల్లటి ఆకృతి గలిగియుండి, ఎద్దుపై ఎక్కి త్రిశూలమును చేతిలో గలిగియుండు వృద్ధ వనిత.

సాధకుడు ప్రతి (ఓంకారముయొక్క) అక్షరము(అ, ఉ, మ)ను ధ్యానించవలెను. గాలిని 'ఇడ' గుండా 16 మాత్రల కాలమువరకు పీల్చ వలెను. ఆసమయమున 'అ' కారమును ధ్యానించవలెను. అటుల పీల్చిన గాలిని 64 మాత్రల కాలము, లోపల ఆపియుంచి, ఆసమయమున 'ఉ' కారమును ధ్యానించ వలెను.తదుపరి 32 మాత్రల కాలమువరకు, పీల్చిన గాలిని విడచుచూ, 'మ' కారమును ధ్యానించ వలెను. ఈ రీతిని ఒకదాని తరువాత ఒకటిగా అభ్యసించవలెను.

ఆసనశుద్ధి పొందిన తరువాతను, ఆత్మ సంయమములో విజయమును సంపాదించిన పిమ్మటను, యోగి సుషుమ్నా నాడిలో గల అపరిశుద్ధతలను పార ద్రోలుటకై, పద్మాసన మందు కూర్చొని, ఎడమ ముక్కు నుండి గాలిని పీల్చి, ఆప గలిగినంత సేపటి వరకు గాలిని లోపల ఆపుజేసి, ఆ పిమ్మట కుడిముక్కు గుండా గాలిని విడువ వలయును. ఆ పిదప కుడి