పుట:Prabodhanandam Natikalu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడు, ఎట్లా పనులు చేసుకుంటూ సంపాదించుకొని ఎలా బ్రతుకుతున్నారో, మానవుడై పుట్టినందుకు సిగ్గు మానముండాలిరా.

వేణు :- నాయనా! నేనేమి అల్లర చిల్లరగా తిరగలేదుగదా! భక్తీ, జ్ఞానము, యోగాల గురించి తెలుసుకుంటున్నాను. అది తప్పంటే ఎట్లా.

కాటమయ్య :- తప్పే లేదంటావా తప్పుడునాయాలా.


తె॥గీ॥

ఇంత జెప్పిన విన నీ ఇచ్చరీతి
వెడలుచున్నను నాయాస్థి కడకు నీకు
చిల్లిగవ్వైన ఇవ్వను కల్లగాదు
ముందు జూపును గనుమింక మూర్ఖచిత్తా


వేణు :- నాన్నగారు ఆస్థి, ఐశ్వర్యం అశాశ్వితమైనవి, పోయేటప్పుడు ఏమైనా వెంటగట్టుకొని పోతామా, అలానే కానివ్వండి. ఆస్థిపాస్థులు కర్మానుసారంగా కలుగుతాయి, కానీ జ్ఞానం మాత్రము శ్రద్ధానుసారంగా కలుగుతుంది. మీ నిర్ణయమదే అయితే జ్ఞానంకోసం వేటినైనా విడచేదానికి సిద్ధంగా ఉన్నాను.

కాటమయ్య :- అలాగైతే నీవన్నిటికి తెగించి ఉన్నావన్నమాట. పో! నీ ముఖమింక నాకు చూపించద్దు.

--పాట--

ప॥

పోపోర పొమ్మికన్‌ నీ ముఖమునాకింక చూపించ
రావలదు రాతగదు పో పోర పొమ్మికన్‌


చ॥

తల్లిదండ్రుల మాటలు వినక
ఇల్లూ వాకిలి కల్లగదలచి
స్వాములు గీములు అంటూ నీవు
యేమో యేమో వాగుచునంటివి