పుట:Prabodhanandam Natikalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవసరాన్ని ఆసరాగా చేసుకొని, ఫైనాన్సు వ్యాపారమని మూడురూపాయల వడ్డీనుండి ఇరవైరూపాయల వడ్డీవరకు ఇచ్చిన ఘనుడవు. ఎంతోమంది దగ్గర భూములు, ఇండ్లు వడ్డీక్రింద లాగుకొన్న మహానుభావుడవు. ప్రపంచములో డబ్బుతప్ప ఏదీ గొప్పదికాదని, ఇతరులకు కూడ నీతి చెప్పిన వానివి. డబ్బుకోసము నీ అన్నదమ్ములను కూడ మోసము చేసినవానివి. నీవే ఒక స్వామీజీని తయారుచేసి, అతని ద్వారా కొందరికి మీరు కాపురము చేసే ఇల్లు బాగాలేదని, వాస్తుదోషముందని తొందరగ అమ్మివేయమని చెప్పించి, ఆ ఇల్లును తక్కువ రేటుకు కొనడము, అలాగే భూములను కూడ అమ్మించి, వాటిని నీవే కొనడము మహాపాపములై నీనెత్తిన కూర్చొన్నవి. నీవు మరుజన్మలో ఇదే భూమిమీద ఏమి అనుభవించాలో యమధర్మరాజే నిర్ణయించగలడు. కింకరులారా! మరొకనిని ముందుకు తెమ్ము. (యమ కింకరులు పోలీస్‌ ఆఫీసర్‌ను ముందుకు తెచ్చారు.)

చిత్రగుప్తుడు :- ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు గారా! ఇపుడు నీవు పోలీస్‌ అధికారివికావు. సాధారణ మనిషివేనని గుర్తుంచుకో. ఉద్యోగము రాకముందు ఏ స్థోమతలేని నీవు, ఉద్యోగము కొరకు ఎంతోమంది దేవతలకు మ్రొక్కుకొన్నావు. ఉద్యోగమొచ్చి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అవుతూనే, నేను పోలీస్‌ను అను గర్వమును నెత్తికెక్కించుకొన్నావు. మనుషులను హీనముగ జంతువుల క్రింద జమకట్టావు. అధికారమదముతో తప్పుచేయని మర్యాదస్తులను దూషించావు. ఆత్మజ్ఞానముగల గురువును, వారి శిష్యులను తప్పు చేయకున్ననూ అదే పనిగ దూషించి తప్పుడుకేసు బనాయించావు. నీకు ఏమాత్రము ఆత్మజ్ఞానము తెలియకుండినా, మీది జ్ఞానమేనా అని గురువునే నిందించి కొట్టేదానికి పూనుకొన్నావు. మిగతా పాపులకంటే నీ పాపమే అధికము, యమధర్మరాజు నిన్ను ఏ విధముగా శిక్షించునో! ఇప్పటికైనా నీ