పుట:Prabodha Tarangalul.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

691. మాయకు గుర్తయిన శరీరములు క్రిందికి పెరిగి అధోగతిని సూచించగ, జ్ఞానమునకు గుర్తయిన వృక్షములు పైకి పెరిగి ఉన్నత గతిని సూచించుచున్నవి.

692. నిజంగా లేని దేవున్ని లేడు అనువారు నాస్తికులు. అబద్దముగ ఉన్న దేవున్ని ఎలా ఉన్నాడు అనువారు హేతువాదులు.

693. లేని దేవున్ని లేడు అనడములో నాస్తికుల వాదన సరియైనదే అవుతుంది. కానీ ఉన్న దేవున్ని ఎలా ఉన్నాడు అని ప్రశ్నించక లేడు అను హేతువాదము సరికాదు.

694. నాస్తికవాదము, హేతువాదము విడివిడిగ ఉండాలి. కానీ హేతువాదులమను వారికి హేతువాదమేదో తెలియక నాస్తికవాదులవలె మాట్లాడడము హేతువాదమనిపించుకోదు.

695. భౌతికము, అభౌతికము రెండు వాస్తవమే. అవి ఏ దేశములోనో లేవు నీ శరీరములోనే ఉన్నాయి.

696. తెలియని విషయమును క్షుణ్ణముగ ప్రశ్నించుకొని పరిశోధించి జవాబు తెలుసుకొనువారు నిజమైన హేతువాదులు. తెలియని అభౌతికమును లేదనువారు అజ్ఞానులేకాని హేతువాదులుకారు.

697. సైన్సును అడ్డము పెట్టుకొని అడ్డముగ మాట్లాడు అబద్దపు హేతువాదులూ, సైన్సుతో తెలియని వానిని తెలుసుకొను నిజమైన హేతువాదులూ. రెండు రకములవారు భూమి విూద కలరు.

698. ఉంటేనే ఏదైన తెలియబడేది. ఒకటి తెలియబడాలి అంటే మనలో ఉన్న అనేక ప్రశ్నలకు జవాబు దొరకాలి. అలాకాకుండ