పుట:Prabodha Tarangalul.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

636. ఎంత జ్ఞానికైనా మనో చలన బాధతప్పనట్లు ఎంతటి దేవతకైనా కష్టాలూ బాధలు తప్పవు.

637. మనుషులలో ధనికులు బీదవారున్నట్లు దేవతలలో కూడ ధనికులు బీదవారు కలరు.

638. మనుషులందరికి ఒకే దేవుడు ఎవడైతే ఉన్నాడో, దేవతలకందరికి కూడ అతనే దేవుడు.

639. ఎవడైన కష్టాలనుండి సుఖములలోనికి వచ్చినా లేక సుఖాలనుండి కష్టాలలోనికి పోయినా అది వాని బుద్ధిని బట్టి కాదు, వాని కర్మనుబట్టియని తెలియవలెను.

640. నీరు భూమిలోపల, భూమి విూద ఉంటుంది. అలాగే పరమాత్మ శరీరములోపల, శరీరము బయటకలడు.

641. పండులోని రసము పండులోపల అంతటా ఉంటుంది, కానీ పండు బయట ఉండదు. అలాగే ఆత్మ శరీరములోపలనే ఉంటుంది, కానీ శరీరముబయట ఉండదు.

642. చెవిటి, మూగ, కుంటి, గ్రుడ్డివాడైన బిక్షగాడు దేవాలయ ఆవరణములో ఒక్కచోట మాత్రము ఉంటాడు, కానీ దేవాలయమంతా తిరగడు. అలాగే ఏ చూపులేని జీవుడు శరీర ఆవరణములో ఒక్కచోట మాత్రమే ఉంటాడు.

643. పక్షి ఆకాశములో పైకి ఎగిరినట్లు ఉన్నతస్థితిని యోగము ద్వారా ఆత్మ జీవునికి అందివ్వాలనుకొంటుంది.

644. పాము భూమి రంధ్రములలోనికి దూరినట్లు మాయ కార్యముల ద్వారా జీవున్ని నీచస్థితిలోనికి చేర్చాలనుకొంటుంది.