పుట:Prabodha Tarangalul.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304. జీవాత్మ పురుషుని అంశయే అయినప్పటికి ప్రకృతి అంశయైన నపుంసకత్వము కల్గి ఉన్నది.

305. శరీరములో మూడు రకముల ఆత్మలు, ఐదు రకముల ప్రకృతి గలదు.

306. పరమాత్మ , ఆత్మ, జీవాత్మ అనబడు మూడు ఆత్మలు ఆకాశ, గాలి, అగ్ని, నీరు, భూమి అనబడు ఐదు ప్రకృతులు కలసి సజీవ శరీరము ఏర్పడినది.

307. శరీరము ఐదురకముల పరికరము కాగా, పరికరములను ఉపయోగించి ఆత్మ పని చేయుచుండగా, పరమాత్మ చూస్తుండగ, జీవాత్మ అనుభవించుచున్నది.

308. శరీరములో కనిపించు అవయవములు, కనిపించని గుణములు మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు అన్నియూ ఎన్నో భాగములై ప్రకృతి జనితములు కాగ పరమాత్మ జనితములైనవి కేవలము ఆత్మ జీవాత్మ రెండుమాత్రము గలవు!

309. శరీరమంతా వ్యాపించి పనులన్ని చేయు ఆత్మ ఎవరికి తెలియనిదై తెరచాటున ఉండగ, శరీరములో ఒక్కచోట నివాసమున్న జీవాత్మ ఏమి చేయకున్నను, తనకేమి తెలియకున్నను, అన్ని చేయుచున్నట్లు అన్ని తెలిసినట్లు భ్రమిస్తూ తెరమీదికొచ్చాడు.

310. శరీరమంతా ప్రకృతి కాగా, శరీరములో మూలసూత్రధారి పరమాత్మ కాగా, అన్ని సమయములలో పాత్రధారిగ ఆత్మఉండగా, సూత్రధారి పాత్రధారి కాని జీవాత్మ మొత్తము శరీరమే తానని