పుట:Peddapurasamstanacheritram (1915).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

{{Center| మూస:2

నా గ్రంధములో లోపం లేదని నేను చెప్పడం లేదు. అనేక లోపాలు ఉండవచ్చు. నా అభివృద్ధి ని కోరే మహాత్ములిచ్చిన సరైన సలహాలను స్వీకరించి ఈ రెండవ ముద్రణ లో కొన్ని సవరణలు చేసాను. నాకు కొత్తగా దొరికిన మరికొన్ని ఆధారాలను అనుసరించి కొన్ని భాగాలు పెంచి రాసాను - ఈ రెండవ ముద్రణ లో ఏవైనా తప్పులు దోషములు ఉన్నా, ఇంకా రానున్న కాలంలో మరిన్ని ఆధారాలు దొరికినా దేశ అభిమానులైన నా ఆంధ్రా సోదరులు నాకు తెలియచేసి మూడవ ముద్రణలో సవరణలు జరిగేలా సహాయం చేస్తారని, సరైన ఆధారాలు లేని సవరణలు మరియు అసందర్భమైన విమర్శలకు జవాబు ఇవ్వడం జరగదని విన్నవించుకొంటున్నాను.

ఈ గ్రంధ రచనలో నాకు సహాయం చేసిన అంగ్లేయాంధ్ర గ్రంధాలను- ఈ గ్రంధం లోని పుట (పేజీ) లలో తెలియచేసాను కానీ పేజీ నెంబర్ వేయుటకు నా దగ్గర ఆ గ్రంధాల యొక్క వ్రాతప్రతులు( ) గానీ ముద్ర ప్రతులు ( )గానీ లేవు పాఠశాలల్లో పిల్లలకు చదువుచెప్పడానికి ఉపయోగించే అనేక పుస్తకాలు చదివి వ్రాసిన బాగాలు , చరిత్ర జ్ఞానం అభిషిలషించే వారు తెలిపిన సుప్రసిద్ధ విషయాలు, ప్రాచీన పుస్తకాలలోని స్థానిక చరిత్రల యొక్క పేరాలు అన్నీ వ్రాతప్రతులే () కావడం వల్ల ఆ ప్రతుల నుండి సేకరించి వ్రాయబడ్డ గ్రంధముల పేజీలు వాటి నెంబర్ లు వేయుటకు వీలు కాలేదు. చిత్రపటాలు ముద్రించడానికి వీలైన మంచి కాగితం లభించక పోవడం వల్ల ఈ ముద్రణలొ చిత్రపటాలు ముద్రించలేదు. వీలైనచో ఈ గ్రంధానికి అనుబంధముగా గానీ, మూడవ ముద్రణలోగానీ ఖచ్చితంగా ముద్రిస్తానని విన్నవించుకొంటున్నాను.

బుధజనవిదేయుడు గ్రంధకర్త