పుట:Peddapurasamstanacheritram (1915).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నారంబించెను ఇతడు తురుష్కదేశమునుండి వచ్చిన యొక యుద్దవీరుడు. ఇతడు బహమనీరాజ్యమునుండి కొంతప్రదేశము నాక్రమించుకొనుటతో మాత్రము తృప్తినొందక, మహమ్మదీయమతమునకు శత్రువులుగా నున్న యాంధ్రరాజులను జయింపగోరి విజృంభించెను. కంభముమెట్టున కధిపతి యైనసీతాపతి నోడించి, యంతవరకుగల తెలుగుదేశము నాక్రమించెను. అద్దంకి గంగాధరకవి వీనివిజయములను దనతపతీసంవరణోపాఖ్యానములొ__

"పీ.పడమటను సవాయి బసవనిగా జేసి యచట గొయ్యలకొండ నావరించె
తమది మల్లాహాను దక్షిణంబున గొట్టి హరియించె బానుగ ల్లదిగిరులు
నుత్తరంబున బరీదోడి పారగ ద్రోలి మెతుకుదుర్గంబాక్రమించిమించె
బ్రధమదిక్కున నొడ్డి పాత్రసామంతుల ధట్టించి కంభముమెట్ట గొనియె
నతని బొగడంగ దగదె యాచతురసీతి
రూఢి గిరిదుత్గలుంఠనప్రౌఢతేజు
వాహశిఖరాధిరోహరేవంతమూర్తి
కుతుబశా హినిక్షాపాలు గుణవిశాలు"

అనుపద్యంబున దభివర్ణించెను. ఇత డాంధ్రదేశముపై దండెత్తివచ్చి వరుసగా కంభముమెట్ట, కొండపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము మొదలగు దుర్గములను ముట్టడింపగా విశ్వనాధదేవగజపతి, సుల్తానుకులీకుతుబ్ షాతో సంధిచేసికొని, యుభయరాజ్యములకు గోదావరినది సరిహద్దుగా నిర్ణయించుకొనిరి. అంతట సుల్తాను కులీకుతుబ్ షా తన ముఖయనగర మైన గోలకొండకు మరలి పోయెను. ఇతడు 1543 వ సంవత్సరము లొ దొంబదవయేట దనరెండవకుమారుడైన జమ్షీదుచే జంపపడియెను. తరువాత 1550 వ సంవత్సరమున బ్రసిద్దివహించిన ఇబ్రహీమ్-కులీ-కుతుబ్ షాహ తెలింగవాదేశము నాక్రమించుకొనియెను.