పుట:Paul History Book cropped.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐకమత్యంగా వుండాలి. మనకు తోడివారితోను, తోడివారికి మనతోను ఎప్పడూ అవసరం వుంటుంది. కనుక అందరం ఇచ్చి పుచ్చుకొంటుండాలి. కలిసి మెలసి జీవించాలి. ఒకేశరీరంలోని వేరువేరు అంగాలాగ మనమందరం పరస్పర సంబంధం కలిగివుంటాం - రోమా 12,5.

ఈ సందర్భంలోనే సోదరప్రేమను గూడ ప్రస్తావించాలి. క్రైస్తవులు స్వార్ణంతోగాని అహంభావంతోగాని పనులు చేయకూడదు. ఒకరి పట్ల ఒకరు వినయంతో మెలగాలి. ఇతరులు మనకంటె అధికులు అనుకోవాలి. మామూలుగా మనం అహంకారంతో నేను గొప్పవాణ్ణి, ఇతరుడు తక్కువవాడు అనుకొంటాం – ఫిలి 23. ఇంకా తిరుసభ సభ్యులు ఒకరికొకరు ప్రేమతో సేవలు చేసికోవాలి - గల 5, 13. వినయమూ ప్రేమభావమూలేందే సేవలు చేయలేం.

క్రీస్తు అవయవాలమైన మనం భేదభావాలతో విడివడిపోతే క్రీస్తే విభజనకు గురైనటు. తొలిరోజుల్లో క్రైస్తవులు రాత్రంతా జాగరణం చేసి ఉదయాన్నే పూజలో సత్ర్పసాదం స్వీకరించే వాళ్లు. వాళ్లు రాత్రి మామూలు అన్నం భుజించే వాళ్లు. దీనికి గ్రీకులో "అగపె' అని పేరు. ఈ భోజనాన్ని అందరూ కలసి ఐక్యభావంతో భుజించాలి. లేకపోతే వాళ్లు విభజనకు గురైనట్లే -1 కొరి 11.20-22. క్రైస్తవులు క్రీస్తు అవయవాలు కనుక వాళ్లు వేశ్యలను కూడితే క్రీస్తు అవయవాలను రంకులాడిపాలు చేసినట్లే -1, కొరి 6,15. ఎన్ని జాతులతో గూడినా తిరుసభ ఏకసమాజం అనేది పౌలు గొప్పభావాల్లో వొకటి. కనుక మనకు విభజనలు పనికిరావు. క్రీస్తు అతనిలోనికి ఐక్యమైన ప్రజలు కలసి ఒక్క దేహమా"తారు. ఒక్క వ్యక్తిగా ఒనగూడుతారు. దీనికే జ్ఞానశరీరం అని పేరు. ఈ శరీరంలోని వ్యక్తులందరూ కలసిమెలసి శస్త్రీ చేసేది, వారికి ఐక్యత నిచ్చేది