పుట:Paul History Book cropped.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలంలోని గ్రీకు మాటకు అడ్డగించడం, ఆర్పివేయడం అని రెండర్గాలు వున్నాయి). పవిత్రాత్మ అంతరంగంలో ఓ దీపంలా వెలుగుతూంటుంది. పాపం చేసినపుడు ఈ దీపాన్ని ఆర్పివేసి కొంటాం. హృదయాన్ని చీకటితో నింపుకొంటాం. చీకటి పిశాచానికి చిహ్నం. ఆత్మ మన హృదయంలో దీపంలా వెలుగుతూ మనకు సత్ ప్రేరణలను కలిగిస్తుంది. ఈ దివ్య దీపాన్ని ఆర్పివేసికొన్నపుడు దాని నుండి వచ్చే ప్రేరణలను కూడా అణచివేసికొంటాం. ఈ పని చేయకూడదు.

ఓరిజిన్ రెండవ శతాబ్దికి చెందిన వేదశాస్త్రి. అతడు జన్మించినపుడు అతని తండ్రి లియొనిడెస్ అతని రొమ్ముని ముద్దు పెట్టుకున్నాడు. బిడ్డ వక్షాన్నెందుకు ముదు పెటుకొన్నావని అడగ్గా లియోనిడెస్ ఈ బిడ్డకు ఇప్పడే జ్ఞానస్నాన మిచ్చారు. దేవుని ఆత్మ ఇతని హృదయంలో ఓ దేవళంలో లాగా నెలకొని వుంది. కనుక నేను ఇతని వక్షాన్ని ముదుపెట్టుకొన్నాను అని చెప్పాడు. ప్రాచీన క్రైస్తవులకు ఆత్మపట్లవున్న భక్తి ఆలాంటిది. నేడు మనకు ఆత్మ పరిజ్ఞానం చాల తక్కువ. తనపట్ల అవగాహననూ భక్తినీ దయచేయమని ఆ దివ్యాత్మనే అడుగుకొందాం.

4. తిరుసభ

జ్ఞానస్నానం ద్వారా నరుడు క్రీస్తుకి సహవాసి ఔతాడు. అతనితో కలసి పోతాడు - 1 కొరి 1,9. తన భక్తులతో కలసి పోయిన క్రీస్తు వారికి సమకాలికుడు ఔతాడు. వారితో కలసి వసిస్తాడు. జ్ఞానస్నానం ద్వారా మనలో వుండే భేదభావాలు తొలగిపోతాయి. ఇక యూదుడని అన్యుడని లేదు. బానిస అని స్వతంత్రుడు అని లేదు. స్త్రీయుని పురుషుడు అని లేదు. క్రీస్తు యేసునందు విూరందరు ఒక్కరే -గల శిక్ట్రాసు మనకు సమకాలికుడు