పుట:Paul History Book cropped.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ క్రీస్తుకలిసే క్రైస్తవుల్లో పనిచేస్తుంటారు. కనుక పౌలు ఈయిద్దరి పేరు పరస్పరం మారుస్తుంటాడు. మన చేత తండ్రిని నాన్న అనిపిలిపించేది ఆత్మ మనచేత ప్రార్థన చేయించేది ఆత్మ కాని పౌలు కొన్నిసారు ఈ రెండు పనులు క్రీస్తు చేయిస్తాడని చెప్నంటాడు.

మనం జ్ఞానస్నానం పొందినపుడే దేవుడు తన ఆత్మను మనకు సంచకరువుగా (బయానాగా) ఇచ్చాడు -2కొరి 1,22. సంచకరువు క్రయవిక్రయాల్లో మొదట చెల్లించే కొద్దిపాటి సొమ్ము ఇది తర్వాత పూర్తిసొమ్ము చెల్లిస్తారు అనడానికి సూచనంగా వుంటుంది. తండ్రి మొదట జ్ఞానస్నానంలో మనకు ఆత్మనిచ్చినపుడే మనకు రక్షణం కొంతవరకు వచ్చింది. తర్వాత ఈ రక్షణం పూర్తిగా సిద్ధిస్తుంది అనడానికి ఆత్మేసూచనంగా వుంటుంది. నరుడు క్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆత్మమూలాన రక్షణం పొందుతాడు. సంపూర్ణ క్రీసుగా తయారౌతాడు -ఎఫె 4, 13. మొదటి మహిమకంటె అధికమైన మహిమను పొంది క్రీస్తు పోలికను ధరిస్తాడు -2కొరి 3.18.

పవిత్రాత్మ తిరుసభకే ఆత్మ మన ఆత్మ మన శరీరంలోని అవయవాలన్నిటిని ఒక్కటిగా బంధిస్తుంది. వాటికి జీవశక్తిని ఇస్తుంది. మనం ఒక్కవ్యక్తిగా పనిచేసేలా చేస్తుంది. ఈలాగే పవిత్రాత్మ తిరుసభలోని ప్రజలందరిని ఐక్యపరుస్తుంది. నిరంతరం వునలను విభజించే జాతి, కులం, లింగం వెుదలైన భేదభావాలన్నిటినీ తొలగిస్తుంది.


ఆత్మ తిరుసభకూ, ఆ సభలోని సభ్యులు ఒక్కొక్కరికీ కూడ అతిథి. ఇప్పడు మనలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేది ప్రధానంగా ఆత్మే ఆత్ముడు మనకు సప్తవరాలు, సేవావరాలు,