పుట:Paul History Book cropped.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూస్థాపితమై, అతనితో పాటు ఉత్థానమౌతాం -రో 6,3-5. తొలిరోజుల్లో పెద్దవాళ్లకు మాత్రమే జ్ఞానస్నానం ఇచ్చేవాళ్లు. వాళ్లను నీటి మడుగులో ముంచి బయటికి తీసికొని వచ్చేవాళ్లు. అది తొలినాటి జ్ఞానస్నానం. గ్రీకులో "బాప్టిజో" అంటే నీటిలో ముంచడమనే అర్థం. క్రీసు చనిపోగా అతన్ని భూగర్భంలో పాతిపెట్టారు. ఇది క్రైస్తవుడు నీటి మడుగులోకి దిగడంలాంటిది. అది అతని మరణానికి పోలికగా వుంటుంది. క్రీస్తు ఉత్థానమై భూగర్భంనుండి వెలుపలికి వచ్చాడు. ఇది విశ్వాసి నీటిమడుగు నుండి వెలుపలికి రావడం లాంటిది. అది అతని వుత్థానానికి పోలికగా వుంటుంది. నేటి మన జ్ఞానస్నానంలో కూడ ఈ పోలికలు మనపై సోకుతాయి. ఈ పోలికలు మనలను క్రీస్తుతో ఐక్యపరచి మనం వరప్రనసాదం పొందేలా చేస్తాయి.

జ్ఞానస్నానం ద్వారా మనం క్రీస్తుతో చనిపోయి అతనితో ఉత్థానమౌతాం. పౌలు మనం క్రీస్తుతో పాటు చనిపోయామనీ, అతనితోపాటు భూస్థాపితమయ్యామనీ, అతనితోపాటు ఉత్థాన వుయ్యూవు నీ చాలాసారు చెప్నంటాడు. ఈ భావాలను సూచించడానికి అతడు గ్రీకుమూలంలో "సున్" అనే ఉపసర్గను వాడుతుంటాడు. దీనికి “తోపాటు" అని అర్థం. అనగా క్రీస్తుతో పాటు అని అర్థం. ఇక్కడ ఈ "తోపాటు "ప్రయోగాలను కొన్నిటిని పేర్కొందాం.

 మనం క్రీస్తుతోపాటు శ్రమలు అనుభవిస్తాం -రోమా 8,17
అతనితోపాటు సిలువ వేయబడతాం -6,6,
అతనితోపాటు మరణిస్తాం - 2తిమో 2,11.
అతనితోపాటు సమాధి చేయబడతాం -రోమా 6,4
అతనితోపాటు ఉత్థాన మరొతాం -కొలో 2,12