పుట:Parama yaugi vilaasamu (1928).pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠా శ్వాసము.

457



శ్రీవైష్ణవులసేవ సేయంగఁ గలిగె
నే వెఱవను సురానీక మెదుర్ప
వనమాలి జగదేకవల్లభుం డతని
తనయవర్గంబు తద్దాసవర్గంబు
వారలు తమసొమ్ము వారక తామ
యారగించెదరుగా కనియెడు తలఁపు
మదిలోన నిలిపె నెమ్మదిఁ బరాంతకుఁడు
పొదలి శంకాతంకములు లేకయుండ
జనులుచే నీతనిచందంబు చోళ
జనవల్లభుఁడు సవిస్తరముగా నెఱిఁగి
పడతాళ్ళచేతఁ దీర్పరుల మన్నీలఁ
దడయక పిలిపించి తద్వార్తఁ జెప్పి
పనిబూని ఘనరాజ్యభార మంతయును
దనమీఁద వైచి తద్దయు నమ్మియుండ
నేపున నాసొమ్ము హితుఁడునుబోలె
బాపురే దాసర్లపాలు సేయుచును
అకట! యెన్నాళ్ళాయె నౌరౌర! నగరి
కోకకాసు చెల్లింపకున్నాఁ డటంచుఁ
గరముల మీస లొక్కటఁ దీటికొనుచు
బెరయంగఁ గరణాలఁ బిలువుఁ డటన్నఁ