పుట:Parama yaugi vilaasamu (1928).pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

398

పరమయోగి విలాసము.


బడఁతి వర్షాకాశపతినాఁగ నందు
కొడుకు సంపదలమైకొని బిత్తరించుఁ
గామపురంబునం [1]గల్పరయనఁగఁ
గామిని విలసిల్లుఁ గామునితండ్రి
కలకంఠిరో! త్రివిక్రముఁ డూరఖంబు
నెలకొని పాలించు నిగమ వేద్యుండు
పురవైరినుతుఁ డష్టభుజకరుం డనఁగ
నరభోజనారి యెంతయు నొప్పు బాల
తిరునిన్నయూర వర్తిలుచక్రవర్తి
కరమర్థితోడ సైకతనిభశ్రోణి!
కూరిమి శ్రీపక్షికుండంబునందు
వారిదవర్ణుండు వామాక్షి మెలఁగు
[2]తో యమహీధ్రనాథుండునా జగతి
వేయుభంగుల నొప్పు వీణావినోద
మానినీ! వినుము శ్రీమస్థలేశుండు
నానొప్పు నవదాత నలినలోచనుఁడు
కనకాంబరుండు సాగరమల్లనాథుఁ
డనువాఁడు విలసిల్లు హరిరాజమధ్య!
మనుజసింహుఁడు మున్ను మహిసప్తమునులు
పనిబూని గడియ దపంబు గావింప


  1. గల్పితనంగ
  2. తోయమహీంద్ర