పుట:Parama yaugi vilaasamu (1928).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

యున్నారు. అందువలన నన్నయ్య క్రైస్తవశకముయొక్క పదునేనవశతాబ్దమధ్యమునం దుండినవానినిగాఁ దలఁపవలసియున్నది. ఈతిరువేంగళనాధుఁడు పరమయోగివిలాసము యొక్క యాశ్వాసాంతములందు,

ద్వి. అనుపమ శ్రీవేంకటాద్రీశదత్త
     మకరకుండలయుగ్మ మండితకర్ణ
  
యనియు, అష్టమహిషీకల్యాణముయొక్క పీఠికలో
      
     ......కావ్యంబుఁ జెప్పి
     యెనలేని శ్రీవేంకటేశు మెప్పించి
     ......మకరకుండలము లిమ్మహి గొన్నవాఁడ
    
అనియు, నాశ్వాసాంతముల యందు
       
ద్వి. అనుపమ శ్రీవేంకటాధీశదత్త
     మకరకుండలయుగ్మ మండితకర్ణ

యనియుం జెప్పియున్నాఁడు. ఈతఁడు కావ్యముచెప్పి మెప్పించిన వేంకటాద్రి లేక వేంకటాధీశుఁ డెవఁడు? వీరేశలింగముపంతులుగారు పై వేంకటాద్రి వసుచరిత్రకృతిభర్తయగు తిరుమలదేవరాయని సోదరుడును బ్రసిద్దినొందిన "తాలికోట" యుద్ధములో విజయనగరసైన్యములకు సర్వసైన్యాధిపత్యము వహించి రణవిహతుఁడైన వేంకటాద్రి యని తలఁచి చంద్రగిరిలో రాజ్యముచేసిన తిరుమలదేవరాయుని చతుర్దపుత్రుడగు వేంకటపతిరాయుఁడేమో యనికూడ