పుట:Palle-Padaalu-1928.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడపడా పడపడా

మొండి పోతూవై మోటల బడితే
మాటలొచ్చెనో మల్లప్పా
మల్లప్పా అని మడుగు జల్లితే
శింగి గుట్టెనో శివలింగూ
శివలింగా అని చింతకుపోతే
గొడ్డాలి దూకె గోవిందూ
గోవిందా అని గోడ కరుకుతే
పెల్లాగూలె వోయీ పెరుమాళ్లూ
పెరుమాళ్లూ అని పెండాకు పోతే
ఆవు దన్నెనో హనుమాన్లు
హనుమానూ అని అంగాడ్కి పోతే
దొంగాలు దోసిరి దడదడా
దడదడా అని దొడ్లోకి పోతే
పోనూ పోకను దెబ్బల్
పడపడా పడపడా
పడపడా పడపడా

71