పుట:Palle-Padaalu-1928.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీటి చెలమ వద్ద

తమల పాకుల మీద వడ్లెండ బోసి
నేబోతు కృష్ణమ్మ నీళ్ళు చెల మలకి
ఊరగదె వుదకంబు తేరగదే వూట
చేదగదె నాచేతి ముత్యాల బిందె
అటుచూచి యిటు చూచి కట్టోంకజూచి
కట్టమీద బోయేటి పొట్టి కోమటి
ఆవులు గలవారి ఆడమనిషిని
కోడేలు గలవారి కోడల్ని నేను
మేకలు గలవారి మేనకోడల్ని
మా అత్త కొట్తాది బిందెత్తి పోమ్ము
మీఅత్త కొట్టనేల బిందెత్త నేల
అటు జూచి యిటు జూచి బాటొంక జూచి
బాటమ్మట వెళ్ళేవు ఓ బాపనయ్య
ఆవులు గలవారి అడమనిషిని
కోడెలు గలవారి కోడల్ని నేను
మేకలు గలవారి 'మేన కోడల్ని
మాఅత్త కొట్తాది బిందెత్తి పోమ్ము
మీఅత్త కొట్ట నేల బిందెత్త నేల
అటు జూచి యిటు జూచి గట్టొంక జూచి
గట్టు మీద పోయేటి పూజారి మాయన్న

98