పుట:PadabhamdhaParijathamu.djvu/781

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూఱ - చూఱ 755 చూఱ - చూఱ

చూఱకాడు

  • కొల్లగొనువాడు.

చూఱకారుడు

  • కొల్ల గొన్నవాడు.

చూఱకొను

  • కొల్లగొట్టు.

చూఱకోలు

  • కొల్లగొనుట.

చూఱకోలు గొను

  • చూఱ గొను.
  • "నా చిత్తము చూఱకోలు గొన రాగ వ్యక్తి పుట్టించెనే." దశ. 3. 63.

చూఱ గైకొను

  • చూఱగొను.

చూఱగొను

  • కొల్లగొను.

చూఱ దెచ్చు

  • కొల్ల గొట్టి తెచ్చు.
  • "కొట్టి సప్తాంగమున జూఱ దెచ్చెద." భార. విరా. 3. 199.

చూఱపట్టు

  • చూఱకొను.
  • "చెన్నలర మనోభవుండు విశిఖాహతి మానము చూఱపట్టె." శృంగా. శాకుం. 2. 156.

చూఱ పుచ్చు

  • చూఱ గొను, నశింప జేయు.
  • "చెఱకువిల్తునిఁ జూఱఁ బుచ్చిన దై." భీమ. 4. 123.

చూఱ పోను !

  • దొంగ లెత్తుకొని పోను!
  • "చూడరే శివభక్తి చూఱ వోను!" కా. మా. 4. 35.
  • వాడుకలో -
  • "నీ ఆట దొంగలు దోల ! అన్నానికి అయినా రండి రా." వా.
  • చూఱపోవుట దొంగలు దోచుటయే. దొంగలు దోల అనేదే నేటి వాడుకలో ఉన్నది.

చూఱపోవు

  • కొల్లబోవు.

చూఱ యిచ్చు

  • ఇష్టం వచ్చినట్టు అనుభవించుకో నిచ్చు.

చూఱలాడు

  • కొల్లలాడు. హర. 5. 53.

చూఱ లిచ్చు

  • చూ. చూఱ యిచ్చు.

చూఱలు కొను

  • చూ. చూఱకొను.

చూఱలు పట్టు

  • చూ. చూఱపట్టు.

చూఱలు వట్టు

  • చూఱపట్టు.

చూఱలు వుచ్చు

  • చూఱపుచ్చు.

చూఱలు సేయు

  • చూఱ యిచ్చు.

చూఱ లొసగు

  • దోచి యిచ్చు.