ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఒంట____ఒంటి 294 ఒంటి____ఒంటి
- ఇలాటి పట్టుల కాస్త పొగరెక్కినాడు అన్న వ్యంగ్యార్థం స్ఫురిస్తూ ఉంటుంది.
ఒంటరీలు
- అంగరక్షకులుగా నుండు అసహాయశూరులు.
- "విభుండు క్రే,వల దగ నొంటరీలు గొలువం గరదీపతతుల్ వెలుం గగన్." శుక. 1. 370.
ఒంటికంబపు మేడ
- ఒకే స్తంభంతో రాజస్త్రీని ఉంచుటకై కట్టినమేడ. మన జానపదకథ లన్నిటిలోనూ వినబడేమాట.
- "పోతుటీగకు నైనను బోవరాని, యొంటికంబపు మేడలం దునిచె దత్సు, తద్వయంబును..." హంస. 5. 273.
- రూ. ఒంటి స్తంభం మేడ.
ఒంటికిట్లు
- ఒక తిట్టు. ఒంటెత్తు మనుష్యులు అని అర్థం కావచ్చును. స్త్రీలను గుఱించి ఇక్కడ ఉపయుక్త మైనది.
- "నీ వెఱుంగవె మున్ను నిక్క మంగనలు... ఒడప మలుపసంతు లొగి నొంటికిట్లు." పండితా. ప్రథ. పురా. పుట. 343.
ఒంటికాలిమీద తపస్సు చేయు
- గట్టిపట్టుదలతో కోరు. తపస్సులో ఒకరక మైన దిది. ఒక పాదంమీదనే నిలబడి తపస్సు చేయుట. పట్టుదలతో కోరుటలో ఒంటి కాలిమీద నిలబడుట అన్న అర్థంలోనే దీనినీ ఉపయోగిస్తారు.
- "వా డా పిల్లకోసం ఒంటికాలిమీద తపస్సు చేస్తున్నాడు. ఆ పిల్ల తండ్రి కిష్ట మైనా తల్లేమో తమ్ముని కివ్వాలని పట్టు పడుతున్నది." వా.
ఒంటికాలిమీద నిలబడు
- ఏదైనా నిర్బంధముగా వెంటనే కావలె నని పట్టుపట్టు.
- "ఒంటికాలనె నిల్చి యూర్మిమారుతములన్, జిగురుఱెక్కలరేకు లెగయుచుండ." శృం. నైష. 1. 98.
- "కాసులదండ కావా లని మా అమ్మాయి ఒంటికాలిమీద నిలుచుంది. ఏం చేయడానికీ తోచడం లేదు." వా.
ఒంటికాలిమీద వచ్చు
- ఒక్కమాటతో మీదికి వచ్చు. మీదబడు, పై బడు.
- కొత్త. 121.
- "వాడు నే నంటే ఒంటికాలిమీద వస్తాడు. వాడి కేం పొయ్యేకాలమో!? వా.
ఒంటిపా టగు
- ఎవరు లేని అవకాశము దొరకు.
- "ఇద్ద ఱీరీతి నింటిలో కేగి నప్పు డొంటిపా టయ్యె శివదత్తు డింట లేమి." హంస. 3. 230.