పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

అనుకోను. ఆంధ్ర దేశానికి సంబంధించి నంతవరకు నా పర్యటనలో ఖద్దరు ఉత్పత్తికోసం విరాళములు సేకరించదలచాను. ఉత్సాహవంతులయిన కార్యకర్తలందరూ నా పట్ల దయకలిగి ఉండవలెను.

మహాత్ముని ఆంధ్ర దేశ పర్యటన హైదరాబాద్ నుండి ప్రారంభమైనది. 1929 ఏప్రియల్ 6వ తేదీ సాయంత్రము హైదరాబాదు చేరారు. నాటి నుండి ఏప్రియల్ 22 వ తేదీ వరకు హైదరాబాద్, జగ్గయ్య పేట, నందిగామ, నూజివీడు, బెజవాడ, ఉయ్యూరు, కపిలేశ్వరపురం, ఎలకుర్రు, గుడివాడ, దివిసీమ, కొడాలి, మచిలీపట్నం, గుంటూరు, తిమ్మసముద్రంలందు సంచారము గావించి బెజవాడ చేరి అచ్చటనుండి పశ్చిమగోదావరి జిల్లా సందర్శనకై బయలుదేరారు.\

"సత్యాగ్రహి' పత్రిక గాంధీజీ పశ్చిమగోదావరి జిల్లా రాకను పురస్కరించుకొని ఇట్లు ప్రకటించినది. మహాత్ముని సంచారమున ప్రజలు గమనింప వలసిన కొన్ని ముఖ్య విషయములు.\

"1. మహాత్ముడు మీటింగులోనికి వచ్చునప్పుడు గాని, మీటింగు నుండి వెళ్ళనప్పుడు , "మహాత్మాగాంధీకీ జై' అనిగాని, 'వందేమాతరం’ అనిగాని కేకలువేయుచు ధ్వని చేయరాదు.

2. మహాత్ముడు సభకు వచ్చుటకు పూర్వమే జనులందరూ ప్రశాంతముగ సభలో కూర్పునియుండవలెను. మహాత్ముడు ప్రవేశించునప్పుడు סחk(, $(& వెళ్ళునప్పుడుగాని సభికులు వారివారి స్థానములనుండిలేవరాదు.

3. ప్రజలు వచ్చుటకు ఒక మార్గము, వెళ్ళటకు 5ూక్ష మార్గము సభలో ఏర్పరచి స్వచ్ఛంద సేవకులు ఇరువైపుల నిలబడవలెను.

4. మహాత్మునికి పూలమాలలు వేయుటకుగాని, పాదములపై పడుటకుగాని ప్రయత్నించరాదు.

5. ప్రశాంతముగా, ఆయనకు ఏ విధమయిన ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించవలెను." *

ఏప్రియల్ 23వ తేదీ మంగళవారం గాంధీజీ ఆయన సహచర బృందము బెజవాడ నుండి పశ్చిమగోదావరి జిల్లాకు బయలు దేరినారు. సరిగా ఉదయం 7.30 ని| పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించారు. జిల్లా బోర్డు ప్రసిడెంటు పెన్మత్స పెద్దిరాజు తన బృందముతో గాంధీజీకి ఎదురేగి ఆహ్వానించారు. పెరికేడులో మహాత్మునికి రూ. 100/- నగదు, కొన్ని