పుట:Oka-Yogi-Atmakatha.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

418

ఒక యోగి ఆత్మకథ

ఒక నెల అయేసరికి, పడిపోయిన ఆమె కాళ్ళు పూర్తిగా నయమయి పోయాయి.

మా గురుదేవులకు హృదయపూర్వకమైన తన కృతజ్ఞత ఆందజెయ్యమని చెప్పింది చెల్లాయి. నేను చెప్పిన కబురు ప్రశాంతంగా విన్నారాయన. కాని నేను సెలవు తీసుకుని వెళ్ళబోతుండగా ఆయన, గూఢమైన వ్యాఖ్య ఒకటి చేశారు.

“మీ చెల్లాయికి అసలు పిల్లలే పుట్టరని చాలామంది డాక్టర్లు చెప్పారు. ఇక కొన్నేళ్ళలో తను ఇద్దరు కూతుళ్ళని కంటుందని కచ్చితంగా చెప్పు.”

ఆ తరవాత కొన్నేళ్ళకి నళినికి ఒక కూతురు పుట్టి ఆనందపరిచింది; మరి కొన్నేళ్ళకి మరో కూతురు కూడా కలిగింది.