పుట:Nutna Nibandana kathalu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్తెమి మహాదేవత అని బిగ్గరగా అరవసాగారు. అక్కడ పెద్ద గుంపు ప్రోగయ్యింది. అసలు సమస్య యేమిటో ఎవరికీ అంతుబట్టలేదు. అప్పుడు ఆనగరాధికారి వచ్చి ప్రజలను శాంతపరచాడు. అర్తెమి గొప్ప దేవతే. దెమిత్రి న్యాయస్థానంలో పౌలు మీద నేరం విన్పించవచ్చు. రాష్ట్ర పాలకుడు ఇప్పడు మీరు చేసే గందరగోళాన్ని సహింపడు అని చెప్పాడు. దానితో ప్రజలు శాంతించి వెళ్లిపోయారు. దెమిత్రి సంక్షోభం అంతటితో ముగిసింది.

పౌలు అక్కడి నుండి త్రోయకు వెళ్లాడు. అక్కడ రాత్రి చాలసేపు ఉపన్యసించాడు. యూతికు అనే యువకుడు కిటికీలో కూర్చుండి ఆ బోధవింటూ కునికిపాటువల్ల పైయంతస్తునుండి క్రిందపడి మరణించాడు. కాని పౌలు అతన్ని జీవంతో లేపాడు. పౌలు త్రోయనుండి మిలేతుకి వచ్చాడు. ఎఫెసు పెద్దలు ప్రోగైవచ్చి అక్కడ పౌలుని కలసికొన్నారు. అతడువారికి ఈలా బోధించాడు. నేనిప్పడు యెరూషలేముకి వెళ్లబోతున్నాను. అక్కడ నా కొరకు ఏమి యాపదలు కాచుకొని వున్నాయో నాకేతెలియదు. మీరు నన్ను మరలకంటితో చూడరు. దేవుడు మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా కాపాడండి. నేను వెళ్లిపోయాక క్రూరమైన తోడేళ్లు మిమ్ము బాధిస్తాయి. నేను మిమ్మ దేవుని సంరక్షణకు అప్పగిస్తున్నానుఅని చెప్పాడు. ఆ పిమ్మట అందరూ సముద్రం వొడ్డున మోకాళూని ప్రార్థన చేశారు. పెద్దలు కన్నీరు కారుస్తూ పౌలుని ఓడదాక సాగనంపారు. ఈ యాత్ర క్రీ.శ. 55-56లో జరిగింది.

107. అగబు ప్రవక్త - అచ 21,7-14

పౌలు మూడవ ప్రేషితయాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో కైసరయ చేరుకొని ఫిలిప్ప ఇంటిలో మకాము చేస్తున్నాడు. అప్పడు అగబు అనే ప్రవక్త అక్కడికి వచ్చి పౌలు నడికట్టును తీసికొని దానితో తన కాళ్లు చేతులు కట్టివేసుకొన్నాడు. ఈ త్రాడు ఎవరిదోఅతన్ని యెరూషలేములో