పుట:Nutna Nibandana kathalu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతాలు చేశాడు. అక్కడ చాలమంది అతని బోధ విని క్రీస్తుని అంగీకరించారు. పేతురు యోహాను కూడ అక్కడికి వెళ్లి అచటి భక్తుల విశ్వాసాన్ని బలపరచారు. వారు చేతులు చాచగా అక్కడి భక్తుల మీదికి ఆత్మ దిగివచ్చింది.

దేవదూత ఫిలిప్పని ఎడారిగుండ గాజాకు పోయే రహదారికి కొనిపోయాడు.అప్పడు యితియోపియా ఉద్యోగి యెరూషలేము వచ్చి ప్రభువుని సేవించుకొని తన దేశానికి తిరిగిపోతున్నాడు. రథంలో కూర్చుండి యెషయా ప్రవచనం చదువుకొంటున్నాడు. “అతన్ని గొర్రెనులాగ వధ్యస్థానానికి కొని పోయారు. ఐనా అతడు నోరుతెరచి మాటలాడలేదు" అనే వాక్యం దగ్గరికి వచ్చాడు. ఫిలిప్ప అతన్ని సమీపించి నీవు చదువుతూన్న వేదవాక్యం నీకు అర్థమయిందా అని అడిగాడు. ఇతియోపీయుడు ఎవరైన వివరణం చెస్తేనేగాని ఈ వేదభాగం నాకు అర్థం కాదు. గొర్రెవలె కొనిపోబడిన ఈ వ్యక్తి యెవరు? ప్రవక్తా లేక మరొక భక్తిమంతుడా అని అడిగాడు. ఫిలిప్ప రథమెక్కిఆ వ్యక్తి యేసేనని చెప్పి ప్రభువుని గూర్చి విపులంగా బోధించాడు. అంతలో వాళ్లు 8ைகு? నీరు కన్పించే చోటికి వచ్చారు. ఆ వుద్యోగి నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను అన్నాడు. ఫిలిప్ప అతన్ని మడుగులోనికి దింపి జ్ఞానస్నానం ఇచ్చాడు. ఆ పిమ్మట దేవుని ఆత్మ ఫిలిప్పని అక్కడి నుండి ఆజోతుకు కొనిపోయింది. ఇతియోపీయుడు తన సొంత దేశానికి వెళ్లి అక్కడి ప్రజలకు క్రీస్తుని తెలియజేశాడు.


98. సౌలు మార్పు చెందడం -అచ 9,1-19

సౌలు యెరూషలేములోని క్రైస్తవులను హింసించడంతో తృప్తి చెందక డమస్కులోని విశ్వాసులను కూడ పట్టుకొని వచ్చి చెరలో పెట్టడానికి అనుమతి పత్రాలను తీసికొని పోతున్నాడు. దారిలోఉత్థాన క్రీస్తు అతనికి పెద్ద వెలుగు రూపంలో దర్శనమిచ్చాడు. సౌలూ! నీవు నన్నెందుకు