పుట:Nutna Nibandana kathalu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రోజుల దాక బెతానియాకు పోలేదు. ఆ పిమ్మట శిష్యులతో లాజరు మరణించాడు, బెతానియాకు వెళ్లాము అని చెప్పాడు. వాళ్లు ఆ వూరు చేరుకోగానే మార్త ఎదురువచ్చి ప్రభూ! నీవు ఇక్కడ వున్నట్లయితే నా తమ్ముడు మరణించేవాడు కాదు అంది. ప్రభువు అతడు మరల లేస్తాడు అని చెప్పాడు. మార్త ఔను! పునరుత్థానకాలంలో లేస్తాడు అంది. యేసు నేనే పునరుత్థానాన్ని నన్ను విశ్వసించేవాడు మరణించినా మళ్లా జీవిస్తాడు అని పల్మాడు. మార్త నీవే మెస్సీయావని నమ్ముతున్నాను అని చెప్పింది. అంతలో మార్త పిలువగా ఇంటిలో నుండి మరియ కూడ వచ్చి ప్రభూ! నీవు ఇక్కడ వున్నట్లయితే మూ తమ్ముడు చనిపోయేవాడు కాదు అంది. ప్రజలు లాజరు సమాధిని క్రీస్తుకి చూపించారు. అతన్ని తలంచుకొని క్రీస్తు కన్నీరు కార్చాడు. లాజరు మీద యితనికి ఎంత ప్రేమ అని ప్రజలు విస్తుపోయారు.

లాజరుని రాతితో మూసివేసిన కొండ గుహలో పాతిపెట్టారు. క్రీస్తు రాతిని తొలగించండి అన్నాడు. కాని మార్త ప్రభూ! తమ్ముడు చనిపోయి నాలు రోజులైనది. రాతిని తొలగిస్తే దుర్వాసన వస్తుంది అని చెప్పింది. ప్రభువు నీవు విశ్వసించావంటే దేవుని శక్తిని చూస్తావు అని చెప్పాడు. పిమ్మట క్రీస్తు తండ్రీ! నీవు నా మనవిని ఆలించినందులకు నీకు వందనాలు చెప్తున్నాను అని పల్మాడు. అటు తర్వాత లాజరూ! నీవు సమాధినుండి వెలుపలికి రా అని ఆజ్ఞాపించాడు. వెంటనే లాజరు లేచి బయటికి వచ్చాడు. అతని కాళ్లు, చేతులు, ముఖం బట్టలతో చుట్టబడివున్నాయి. యేసు ఆ కట్లు విప్పి అతన్ని వెళ్లిపోనీయండి అని ఆదేశించాడు.

క్రీస్తు చేసిన అద్భుతాన్ని తెలిసికొని యూద నాయకులు భయపడ్డారు. ఇతడు ఈలా అద్భుతాలు చేస్తుంటే ప్రజలంతా యితని చుటూ గుంపు గూడతారు. మెస్సీయా రానే వచ్చాడని రోమీయుల మీద తిరగబడతారు. అపుడు రోమీయులు వచ్చి మనలను నాశం జేస్తారు