పుట:Nutna Nibandana kathalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51. ద్రాక్షతోట ఉపమానం - యోహా 15,1-6

ప్రభువు ద్రాక్షతోట ఉపమానం చెపూ శిష్యులతో ఈలాగన్నాడు. నేను ద్రాక్ష తీగను. మీరు నాలోనికి అతుకుకొన్న కొమ్మలు. మీరు నా యందు నిల్చి వుంటే చక్కగా ఫలిస్తారు. నా నుండి వేరైపోతే యెండిపోతారు. కనుక నిరంతరం నాతో ఐక్యమై వుండండి అని చెప్పాడు. ప్రభువుతో ఐక్యమై వుంటే అతని జీవాన్ని పొంది మనం కూడ పవిత్ర జీవితం గడుపుతాం.

52. మంచి కాపరి - యోహా 10, లూకా 15

యేసు తాను మంచి కాపరినని చెప్పాడు. అతడు తనగొర్రెల కొరకు ప్రాణాలు అర్పించేవాడు. జీతగాడు తోడేలు రాగానే మందను విడచి పారిపోతాడు. కాని క్రీస్తు మంద కొరకు ప్రాణాలు అర్పిస్తాడు. ప్రభువుకి తన గొర్రెలు తెలుసు. ఆ గొర్రెలకూ ప్రభువు తెలుసు. ప్రభువు మందకు చెందని గొర్రెలు కూడ వున్నాయి. వాటిని గూడ తోలుకొని రావాలని అతని కోరిక. ఓ కాపరికి నూరు గొర్రెలు వున్నాయి. వాటిల్లో వొకటి తప్పిపోయింది. అతడు 99 గొర్రెలను వదలిపెట్టి తప్పిపోయినదాని కొరకు వెదికాడు. అది దొరికిన తర్వాత యింటికి తీసికొని వచ్చి మిత్రులను గూడ పిలవగా అందరూ వచ్చి ఆనందించారు. ఈ కాపరి క్రీస్తే అతడు నెనరుతో పాపులను వెదకి దైవరాజ్యంలో చేర్చేవాడు.

53. తప్పిపోయిన కుమారుడు - లూకా 15

ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు వున్నారు. చిన్నవాడు తన ఆస్తిని పంచుకొని దూరప్రాంతాలకు వెళ్లిపోయాడు. అక్కడ భోగవిలాసాలతో ఆస్తినంతటినీ ఖర్చుబెట్టాడు. అంతలో పెద్ద కరువు వచ్చింది. అతడు ఓ యజమానునికి జీతానికి కుదరగా పందులు మేపే పని వాని పాలబడింది. ఆ కరువు కాలంలో వానికి పందులు తినే పొట్టు కూడ దొరకలేదు. అతడు కనువిప్ప కలిగి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. నానా! నేను నీకూ