పుట:Nanakucharitra021651mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

నానకు చరిత్ర.

దీభాషం జక్కగం జదువను వ్రాయను నేర్చినట్లును లెక్కల వ్రాయుటలో బ్రోడయైనట్లు గొంతకాల ముద్యోగములు చేసినట్లును మనకు బెక్కుదృష్టాంతములు గలవు. అక్షరాభ్యాసమైన మరునాడే చదువు ముగించిన కుఱ్ఱవాని కంతటి ప్రజ్ఞగలుగుట యసంభవము గావున నతని చదువు రెన్నాళ్ల చదువుగాక రెండేండ్లచదువో, అంతకంటె కొంచముతక్కువ కాలపు చదువో యైయుండవచ్చునని మన మూహింప వలసి యుండును. ఎట్లయిన నానకు విద్యావిషయమున విస్తారము శ్రద్ధ జూపినట్లు గానబడదు. కుమారునకు జదువుమీద నెక్కుడు తమకము లేదనియో నేర్చినవిద్య సగౌరవముగ దేహయాత్ర గడపుటకు జాలుననియో యెందుచేతనో తండ్రి యచిరకాలమునే కొడుకుం జదువమానిపించెను. అట్లు పాఠశాల విడుచునప్పటికి నానకు తొమ్మిదియేండ్ల ప్రాయము వాడు.

చదువు మానిపించిన వెంటనే కాళుడు కుమారు నేదైన వ్యాపారమునం బ్రవేశపెట్టవలయునని నిశ్చయించుకొనెను. అది మొదలు తండ్రికి గొడుకునకు నెడతెగని వైరుధ్యమే సంభవించెను. నానకు ప్రత్యక్షముగ దండ్రిజెప్పిన పనిజేయ నిష్టము లేనట్లు గనబడకపోయినను దన కైహిక వ్యాపారములయం దెంతమాత్ర మిష్టము లేదని చేష్టలచేత జెప్పకయే చెప్పుచు వచ్చెను. విద్యాభ్యాసము ముగిసినతోడనే కాళుడు కుమారుని బనిలో మప్పదలచి వాని బసులకాపరి