పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంగడివాళ్లు కొన్ని మందులను డాక్టరు వ్రాసియిస్తే మాత్రమే అమ్ముతారు. ఇవి ప్రభుత్వం నిషేధించిన మందులు. రోగులు ఈ మందులను వైద్యుడు తీసికొన్నప్పుడు మాత్రమే తీసికోవాలి. ఇంకా అతడు చెప్పిన మోతాదులో మాత్రమే తీసికోవాలి. వీటిల్లో విషం వుంటంది. అందుకే వీటిపై నిషేధం పెట్టారు.

కొంతమంది తలనొప్పి, జ్వరం, జలుబు మొదలైన రోగాలు రాగానే డోక్టరును సంప్రతించకుండా స్వయంగానే మందులు కొని సేవిస్తారు. ఇది చాలా చెడ్డ పద్ధతి. ఈ మందులకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి మన రోగాలను అప్పటికప్పుడు నయంజేసినా మన శరీరంలో కొన్ని అవయవాలకు కీడు చేస్తాయి. ఈలా మన యిష్టం వచ్చినట్లుగా మందులు తీసికొంటే మన శరీరాలు వీటికి అలవాటు పడిపోతాయి. ఆ మీదట ఇవి అవసరమొచ్చినపుడు అసలు పనిచేయవు. కనుక డోక్టరు వ్రాసియూయని మందులను మనంతట మనం వాడకూడదు.

పైన పేర్కొన్న వాటిల్లో చాల పదార్థాలను ప్రభుత్వం నిషేధించి వుండకపోవచ్చు. అంతమాత్రం చేతనే వాటిని వాడుకోగూడదు. ప్రభుత్వ నిషేధం ఉన్నా లేకపోయినా, వాటిల్లో విష పదార్థాలు వుంటాయి కనుక వాటిని మానివేయాలి. విశేషంగా యువత వీటి విషయంలో జాగ్రత్తగా వుండాలి.

17. ఆత్మగౌరవాన్ని పెంచుకోవద్దా?

ఆత్మగౌరవం అంటే తన్ను తాను విలువతోను గౌరవంతోను చూచుకోవడం. నేను సమర్ధుణ్ణి, ప్రయోజకుణ్ణి అనుకోవడం. నరులు వృద్ధిచెంది విజయాలు సాధించాలంటే ఈ గుణం అత్యవసరం. ఇది కొందరిలో వుంటుంది. కొన్ని కారణాలవల్ల కొందరిలో లోపిస్తుంది. కాని మనం ప్రయత్నం చేసి ఈ గుణాన్ని అలవర్చుకోవచ్చు.

నరులు చిన్నపిల్లలుగా వున్నప్పుడే ఆత్మగౌరవం అలవడ్డం లేక అలవడక పోవడం అనేది జరుగుతుంది. చిన్న పిల్లలను విలువతో చూచి మెచ్చుకొంటే వారి పనులను ప్రశంసిస్తే వారి మీద వారికే నమ్మకం కలిగి ఆత్మగౌరవం ఏర్పడుతుంది. ఆలా కాక వారిని అనాదరం చేసి, ఎగతాళి చేసి ఏడ్పిస్తే వారికి