పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండేవాళ్లు అంతగా కోపించరు. కనుక తగ్గి వుండడం అలవాటు చేసికోవాలి.

భోజనంలో ఉప్ప, కొవ్వు పదార్థాలు తగ్గిస్తే కోపం తగ్గుతుంది. నిత్యం వ్యాయామం చేస్తుంటే శరీరంలోని వత్తిడి తగ్గిపోయి శాంతస్వభావం అలవడు తుంది. భగవచ్చింతన ప్రార్ధన కూడ కోపాన్ని అదుపు చేస్తాయి.

కోపం రావడం వేరు, దాన్ని ప్రదర్శించడం వేరు. చిరాకు రాగానే దాన్ని బయటికి చూపించనక్కర මීක්‍ෂ, నిగ్రహించుకోవచ్చు. ప్రయత్నం ಪೆಸಿ కోపస్థాయిని తగ్గించుకోవచ్చు. తన్ను తాను అదుపులో వుంచుకొనేవాడు కోపానికి వశుడైపోడు.

అగ్నిని ఆరంభంలోనే ఆర్పివేయడం సులభం. ముండ్ల చెట్టని చిన్నదిగా వున్నప్పుడే కొట్టివేయడం తేలిక. కోపాన్ని ప్రారంభదశలోనే అణచివేయడం సులువు. ఆగ్రహావేశాలు ముదిరాక ఇక మన అదుపులో వుండవు. కనుక కోపాలోచనలను మొదటలోనే గుర్తుపట్టి సవరించుకోవాలి. ఉద్రేకానికి ముఖ్య కారణం ఆలోచనలే. వాటిని అణచుకొంటే కోపాన్ని జయించినట్లే,

కోపం వచ్చినప్పడు ఎదుటి వ్యక్తినుండి ప్రక్కకు తొలగి కాసేపు అటూయిటూ తిరిగితే ఆవేశం తగ్గుతుంది.

సంఖ్యలను కాసేపు లెక్కపెట్టినా కూడ కోపం తగ్గుముఖం పడుతుంది. హాస్య సంఘటనలూ, జోకులూ తలంచుకొన్నాగూడ ఆగ్రహం ఆవిరైపోతుంది. కోపాన్ని అదుపుచేసికొనే మార్గాలు చాల వున్నాయి. వేటినైనా వాడుకోవచ్చు. ఆ దుర్గుణాన్ని సవరించుకోవడం మాత్రం ముఖ్యం.

9. ప్రేమ శక్తి

లోకాన్ని నడిపించేది ప్రేమశక్తే ఆ శక్తి లేకపోతే ప్రపంచం ఎడారిగా మారిపోతుంది. అన్ని మతాలూ భగవంతుడు ప్రేమస్వరూపుడనీ, ప్రాణికోటికి ఆధారం ప్రేమేననీ చెప్తాయి. అతని రూపంకలిగిన తోడి నరుణ్ణి కూడ ప్రేమించాలి.