పుట:Naayakuraalu.Play.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

నాయకురాలు

నల. రా : నే వోడితే రాజ్యం మీకు వదిలి యేడేండ్లు దేశ త్యాగంజేసి సపరివారంగా ప్రవాసం చేస్తాను.

మ. దే. రా: నే వోడినా అదే పందెం. గెలిస్తే పల్నాటి ఏకచ్ఛత్రాధిపత్యంజేస్తా. వోడితే నా మొదటిస్థితికి నే వస్తా.

బ్రహ్మ : నాగమ్మగారూ, సరేనా ?

నాయ : మీ రేమంటారో చెప్పలేదే ?

బ్రహ్మ: ఏమయినా సరే, అన్నమాటకు వెనుకకుపోయేది లేదు.

నాయ : (నలగామరాజుతో ఆలోచించి) యేమయినా సరే, మేమూ వెనుకకుబోము.

కొమ్మ : ఇది యేదో విలయానికి వచ్చింది. యీ పందెం కూడదు.

అ. రా : నేను ఉభయులనూ ప్రార్థిస్తాను. ఇంకొక పందెం పెట్టుకోండి. ఎవరు వోడినా కష్ట మే, అయిన వాండ్లలో పని.

మ. దే. రా : (బ్రహ్మనాయుడితో) వీండ్లు ప్రతిదానికీ అడ్డం వస్తున్నారు. తమరు లేచి గట్టిగా జెప్పండి.

బ్రహ్మ : ( లేచి) కొమ్మరాజుగారు చెప్పినది వాస్తవమయినా ఉభయరాజులూ, మంత్రులూ కలిసి పందెం వొడ్డి వెనుక దీయడం అక్రమం.

నాయ : నన్నూ అదే బాధిస్తున్నది.

మ. దే. రా : ఏమయినా కానియ్యండి, నేను వెనుకడుగు వేయను.