పుట:Naayakuraalu.Play.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

79

నాయ : అయ్యా, మీ రెందుకు తొందరపడతారు. అవసరము వచ్చినప్పుడు చూపింతురుగాని.

కొమ్మ : ఇదియేమో పెద్ద పన్నుగడగా వున్నది.

నర : ఎవడివో వెఱ్ఱిమాటలకు మీ రుభయులూ కోపించడం బాగాలేదు.

కేతు : రెడ్డిక్షాత్రం వెలమక్షాత్రానికి తీసిపోయేదిగాదు.

బా. చం : పారంపర్యంగా వచ్చే వెలమక్షాత్రం యెండాకాలంలో వచ్చే రెడ్లయొక్క చొప్పకట్టక్షాత్రంక్రింద ఆగుతుందా?

కేతు : రెడ్డికత్తులు వెలమకుత్తుకలకు ప్రయోగించినప్పుడు తెలుస్తుంది.

బా. చం : రెడ్లకత్తులు చొప్పకట్టలు బాగా నరుకుతవి.

బ్రహ్మ: అయ్యా, మనము విలాసంగా పండుగ గడుపుకోడానికి వచ్చాం. మీ వాక్కలహాలుచాలించి పందేలు ప్రారంభించండి. మధ్యవర్తిని యెన్నుకొందాము.

నర : ఉభయులకు కావలసినవాడూ, శ్యాయస్తుడూ, ఆలరాజే దీనికి తగినవాడు.

బ్రహ్మ: మాకూ యిష్టమే.

అ. రా: నాన్నగారూ ! యిది యేదో యెత్తుగా తోస్తున్నది.

కొమ్మ : ఏమన్నాగానియ్యి. అంగీకరించి న్యాయం జెప్పు. ఉభయులూ కోరినప్పుడు కాదనడం తప్పుమాట.

అ. రా : అంగీకరించాను. మీ ఉభయులు చెరొక ప్రతినిధిని నిర్ణయించుకొని వారిద్వారా పుంజులను వదలండి. నల. రా : మా తరఫున నాగమ్మగారు. ఆమే చర్యల కన్నిటికీ నే బద్ధుణ్ణి.